Vodafone Idea: బకాయిలు చెల్లించలేని స్థితిలో ఉన్న వొడాఫోన్ ఐడియాలో 35.8 శాతం వాటా తీసుకోవడం వెనుక ఆ కంపెనీని స్వాధీనం చేసుకొనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేంద్ర టెలికాం శాఖ కార్యదర్శి రాజారామన్ స్పష్టం చేశారు. ఆ సంస్థకు చేయూతనివ్వడం కోసమే ఆ పనిచేశామన్నారు. సంస్థ యాజమాన్య విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని స్పష్టంచేశారు. 'అది ప్రైవేటు కంపెనీ గానే నడుస్తుంది. ఆ సంస్థ ఎప్పుడు బకాయిలు చెల్లిస్తుందో, అప్పుడు ప్రభుత్వం వాటాలను వెనక్కి ఇచ్చేసి బయటకొస్తుంది. ఈ రంగంలో తగిన సంఖ్యలో కంపెనీలు ఉండి, ఆరోగ్యకర పోటీతో నడవాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న'ట్లు ఆయన 'ఈనాడు'తో చెప్పారు. ముఖ్యాంశాలివీ..
వొడాఫోన్ ఐడియా బకాయిలు చెల్లించలేని పరిస్థితికి వస్తే ఏం జరుగుతుంది?
అలాంటి సమస్య వస్తే.. దివాలా స్మృతి లాంటి ప్రామాణిక ప్రక్రియలు ప్రభుత్వం ముందుంటాయి. ఇప్పటికి మాత్రం ఆ సంస్థ యథావిధిగా పనిచేస్తూ వినియోగదారులకు సమర్థంగా సేవలు అందించాలని కోరుకుంటున్నాం.
బకాయిలు చెల్లించకపోతే.. ఆ వాటాలను మరో కంపెనీకి విక్రయించొచ్చు కదా?
అలాంటి పరిస్థితి వస్తే ప్రభుత్వం ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని 'దీపమ్' విభాగం నిర్దేశించిన ప్రామాణిక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ప్రకారం ముందుకెళ్తుంది. ప్రభుత్వానికి కంపెనీలను నడిపే ఉద్దేశం ఏమాత్రం లేదు. వ్యూహాత్మక రంగాల్లోనూ ప్రభుత్వం ఒకటి, రెండు సంస్థలకే పరిమితమవుతోందని గుర్తించాలి.
గతంలో ఇలా చేయలేదు.. ఇప్పుడెందుకు?