CCI Penalty On Amazon: అమెరికాకు చెందిన ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్, కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూపు మధ్య పెట్టుబడులకు సంబంధించిన వివాదం మరో మలుపు తిరిగింది. ఫ్యూచర్ గ్రూపుతో అమెజాన్ ఒప్పందానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నట్లు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తెలిపింది. ఒప్పందం విషయంలో తప్పుడు సమాచారం ఇవ్వడం సహా ఇతర విషయాలను దాచిపెట్టినందుకుగాను అమెజాన్‌కు రూ.202 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది.
సీసీఐ తన 57 పేజీల ఉత్తర్వుల్లో అమెజాన్, ఫ్యూచర్ గ్రూపు మధ్య ఒప్పందానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. 60 రోజుల్లోగా పూర్తి వివరాలతో ఫామ్ 2ను దాఖలు చేయాలని అమెజాన్ సంస్థను ఆదేశించింది.