జియో ప్లాట్‌ఫాంలో ఫేస్బుక్ 9.99 శాతం పెట్టుబడి ప్రతిపాదనను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదించింది. జియోలో వాటాల కొనుగోలు చేస్తున్నట్లు ఏప్రిల్‌లోనే ఫేస్బుక్ ప్రకటన చేసింది. రూ.43,574 కోట్లను పెట్టుబడిగా పెట్టింది.
ఈ ప్రక్రియ ఫేస్బుక్ ఆధ్వర్యంలోని జాధూ హోల్డింగ్స్ ఎల్ఎల్సీ సంస్థ ద్వారా జరగాల్సి ఉంది. ఈ మేరకు దీనికి సంబంధించిన పెట్టుబడి పూర్తైనట్లు సీసీఐ స్పష్టం చేసింది. 'జియోలో 9.99 శాతం వాటాను జాధూ హోల్డింగ్స్ కొనుగోలు చేయడాన్ని ఆమోదించాం' అని ట్వీట్ చేసింది సీసీఐ.