పన్ను చెల్లింపుదార్లు.. జీఎస్‌టీ రిఫండ్‌లను క్లెయిమ్ చేసుకునేందుకు ఆధార్ ధ్రువీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన పాన్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లోనే జీఎస్‌టీ రిఫండ్‌లు(GST return Aadhar link ) వేసేలా కూడా చర్యలు చేపట్టింది. పన్ను ఎగవేతల నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంది. ఇందుకుగాను జీఎస్‌టీకి సంబంధించి వివిధ నిబంధనల్లో(GST refund rules) కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) సవరణలు చేసింది.
'జీఎస్‌టీ రిఫండ్ క్లెయిమ్‌లకు ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి'
జీఎస్‌టీ రిఫండ్‌లను క్లెయిమ్ చేసుకునేందుకు ఆధార్ ధ్రువీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పన్ను ఎగవేతల నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంది.
జీఎస్‌టీ రిఫండ్
సెప్టెంబరు 17న జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా సీబీఐసీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అలాగే వ్యాపారులు జీఎస్‌టీ వివరాలు సమర్పించే జీఎస్‌టీఆర్-3బీ రిటర్న్ దాఖలు చేయడాన్ని ఒక్క నెల ఆపేసినా.. ఆ తదుపరి నెలకు జీఎస్‌టీఆర్-1 విక్రయాల రిటర్న్‌ను(GST refund eligibility) దాఖలు చేసే వీలుండదని కూడా ఇందులో పేర్కొంది.
ఇదీ చూడండి:Fuel Price Today: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు