ఎస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రానా కపూర్‌కు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). ఆయనతో పాటు ఎస్ బ్యాంక్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కపూర్ కుటుంబ సభ్యులు, మరికొందరికి.. దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశాలిచ్చింది.
వీరిలో కపూర్‌తో పాటు ఆయన భార్య, ఇద్దరు కూతుళ్లు, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్ కపిల్ వధవాన్, ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్ ప్రమోటర్ ధీరజ్ వధవాన్ ఉన్నారు. ఇలా మొత్తం ఏడుగురికి లుక్ అవుట్ జారీ చేసి.. విదేశాలకు వెళ్లకుండా నియంత్రించింది సీబీఐ.