ఎస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రానా కపూర్‌పై మరో కేసు నమోదు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. థాపర్ సంస్థలకు రూ.1,500 కోట్లు రుణం ఇచ్చిన కేసులో కపూర్‌తో పాటు ఆయన భార్య బిందు, అవంతా రియాల్టీ ప్రమోటర్ గౌతమ్ థాపర్ పేర్లను చేర్చింది.
ఎస్ బ్యాంకు రానా కపూర్‌పై మరో సీబీఐ కేసు
ఎస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రానా కపూర్, ఆయన భార్య బిందు, అవంతా రియాల్టీ ప్రమోటర్ గౌతమ్ థాపర్‌పై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. థాపర్ సంస్థలకు రూ.1,500 కోట్ల రుణాల మంజూరు విషయంలో లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ఈ కేసు నమోదు చేసింది.
రానా కపూర్
రుణాలు మంజూరు చేసే విషయంలో నిబంధనలను సడలించడం సహా లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ఈ కేసు నమోదు చేసింది సీబీఐ. ఈ కేసుకు సంబంధించి దిల్లీ, ముంబయిలోని రానా కపూర్, గౌతమ్ థాపర్ నివాసాలు, కార్యాలయాలతోపాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.