కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (సీబీడీటీ) ఛైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ (పీసీ మోదీ) పదవీకాలం మరో ముడు నెలలు పొడిగించింది కేంద్రం. కేంద్ర క్యాబినెట్ నియామక కమిటీ ఇందుకు ఆమోదం తెలిపింది.
సీబీడీటీ ఛైర్మన్గా మరో 3 నెలలు పీసీ మోదీనే - ప్రమోద్ చంద్ర మోదీ పదవీ కాలం పొడగింపు
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ ఛైర్మన్గా ప్రమోద్ చంద్ర మోదీ పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి వచ్చే మూడు నెలల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు.

సీబీడీటీ ఛైర్మన్ పదవీ కాలం పొడగింపు
పీసీ మోదీ పదవీ కాలం పొడిగింపు.. మార్చి 1 నుంచి మే 31 వరకు గానీ లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు గానీ అమలులో ఉండనుంది. ఈయన పదవీ కాలాన్ని 2020 ఆగస్టులో ఆరు నెలలు పొడిగించింది కేంద్రం. ఆ సమయమూ ముగుస్తుండటం వల్ల మరోమారు పొడింగించింది.
ఇదీ చదవండి:కొవిడ్ టీకా ధరలపై షా అసంతృప్తి!