తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.3,750 కోట్లు వదులుకుంటాం: కెయిర్న్ - business news updates

రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదంలో భారత్​ అసలు చెల్లించేందుకు అంగీకరిస్తే ఖర్చులు, వడ్డీ కింద చెల్లించాల్సిన 500 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.3750 కోట్లు) వదులుకుంటామని కెయిర్న్‌ ఎనర్జీ పీఎల్‌సీ ప్రతిపాదించింది. ఈ మొత్తాన్ని భారత ప్రభుత్వం గుర్తించిన చమురు- గ్యాస్‌ లేదా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్‌లో పెట్టుబడిగా పెడతామని పేర్కొంది.

Cairn offers to forego USD 500 mn if India agrees to pay principal due
రూ.3,750 కోట్లు వదులుకుంటాం: కెయిర్న్

By

Published : Apr 12, 2021, 5:30 AM IST

రెట్రోస్పెక్టివ్‌ (వెనకటి తేదీ నుంచి విధించిన) పన్ను వివాదంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (ట్రైబ్యునల్‌) తీర్పు మేరకు ‘అసలు మొత్తం’ 1.2 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.8,800 కోట్లు) చెల్లించేందుకు భారత్‌ అంగీకరిస్తే, ఖర్చులు, వడ్డీ కింద చెల్లించాల్సిన 500 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.3750 కోట్లు) వదులుకుంటామని కెయిర్న్‌ ఎనర్జీ పీఎల్‌సీ ప్రతిపాదించింది. ఈ మొత్తాన్ని భారత ప్రభుత్వం గుర్తించిన చమురు- గ్యాస్‌ లేదా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్‌లో పెట్టుబడిగా పెడతామని పేర్కొంది.

ఈ అంశాన్ని వివాద్‌ సే విశ్వాస్‌ ద్వారా పరిష్కరించుకోవాల్సిందిగా కెయిర్న్‌కు భారత ప్రభుత్వం సూచించింది. కెయిర్న్‌ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది.

ఇదీ చూడండి:అప్​స్టాక్స్​పై సైబర్ దాడి- కీలక డేటా లీక్​

ABOUT THE AUTHOR

...view details