ప్రముఖ ఔషధ తయారీ సంస్థ క్యాడిలా హెల్త్ కేర్(Cadila Healthcare) శుక్రవారం శిల్పా మెడికేర్తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. తమ సంస్థ అభివృద్ధి చేసిన జైకొవ్-డి(Zycov-D Vaccine) కొవిడ్ వ్యాక్సిన్‌ను శిల్పా మెడికేర్ ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొంది.
"శిల్పా మెడికేర్తో ఒప్పందం కుదిరింది. కర్ణాటక ధార్వాడ్‌లోని ఇంటిగ్రేటెడ్ బయోలజిక్స్ ఉత్పత్తి కేంద్రంలో శిల్పా బయోలజికల్స్.. జైకొవ్-డి వ్యాక్సిన్ తయారీ ప్రారంభించనుంది. అనంతరం వ్యాక్సిన్ సరఫరా చేయనున్నాం." అని క్యాడిలా హెల్త్‌కేర్ తెలిపింది. ఈ మేరకు జైకొవ్-డి టెక్నాలజీని శిల్పా బయోలజికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు(ఎస్బీపీఎల్) షేర్ చేయనున్నట్లు పేర్కొంది.
రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఎస్బీపీఎల్(Shilpa Medicare News) వ్యాక్సిన్ తయారీ బాధ్యలు చేపట్టనుంది. ఫిల్లింగ్, ప్యాకేజింగ్, సరఫరా మొదలైనవి క్యాడిలా సంస్థ చూసుకోనుంది.