కస్టమ్స్ అఫెన్సెస్ను కట్టడి చేయటం, ఇరు దేశాల మధ్య సమాచార మార్పిడికి భారత్, బ్రిటన్ మధ్య ఒప్పందం చేసుకునేందుకు ఆమోందం తెలిపింది కేంద్ర మంత్రివర్గం. కస్టమ్స్ సుంకాల చెల్లింపు, రికార్డుల్లో అవకతవకలు వంటి వాటిని తగ్గించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఓ ప్రకటన చేసింది కేంద్రం.
" ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కస్టమ్స్ సహకారం, కస్టమ్స్ విషయాలలో పరస్పర పరిపాలన సహాయంపై భారత ప్రభుత్వం, బ్రిటన్, నార్తర్న్ ఐర్లాండ్ మధ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా కస్టమ్స్ నేరాల్లో దర్యాప్తు, కట్టడికి కావాల్సిన సమాచారం లభించనుంది. సులభతర వాణిజ్యానికి దోహదపడనుంది."
- ప్రభుత్వ ప్రకటన