నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్పాన్సర్ చేసిన ఎన్ఐఐఎఫ్ డెట్ ప్లాట్‌ఫామ్‌లో 6 వేల కోట్ల రూపాయల ఈక్విటీ పెట్టుబడులకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు.
ఆత్మనిర్భర్ భారత్ 3.0 ప్యాకేజీలో భాగంగా 6 వేల కోట్ల రూపాయలు ఈక్విటీగా ఎన్ఐఐఎఫ్లోకి పెట్టుబడి పెట్టాలని కేంద్రం గతంలో నిర్ణయించింది.
లక్ష్మీ విలాస్ విలీనం..
సంక్షోభంలో ఉన్న లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను.. డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేసేందుకు ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. 20 లక్షల మంది ఖాతాదారులు, 4 వేల మంది ఉద్యోగుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జావడేకర్ తెలిపారు. ఖాతాదారులు డిపాజిట్లు ఉపసంహరించుకునే ఆంక్షలను తొలగించినట్లు పేర్కొన్నారు.