సంక్షోభంలో చిక్కుకున్న ఎస్ బ్యాంకును గట్టెక్కించేందుకు.. ఆర్బీఐ ప్రతిపాదించిన పునర్నిర్మాణ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమెదం తెలిపింది. ఎస్ బ్యాంకులో ప్రభుత్వ రంగ బ్యాంకు దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) రూ.7,250 కోట్లతో 49 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఆమోద ముద్ర వేసింది.
మారటోరియం..
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎస్ బ్యాంకుపై మార్చి 5న మారటోరియం విధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఎస్ బ్యాంకు బోర్డును రద్దు చేసి.. ఎస్బీఐ మాజీ డిప్యూటీ ఎండీ, సీఎఫ్ఓ ప్రశాంత్ కుమార్కు నిర్వహణ బాధ్యతలు అప్పగించింది.
పునర్నిర్మాణ పథకం ఇది
- ఎస్ బ్యాంకులో 49 శాతం వాటాను ఎస్బీఐ కొనుగోలు చేయనుంది.
- ఇతరుల నుంచి కూడా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు.
- వచ్చే మూడేళ్లలో ఎస్ బ్యాంక్లో ఎస్బీఐ వాటా 26 శాతానికి తగ్గకుండా చూడటం
- అధీకృత మూలధనం రూ.1,100 కోట్ల నుంచి రూ.6,200 కోట్లకు పెంపు
- ఎస్ బ్యాంకు పునర్నిర్మాణ పథకానికి నోటిఫికేషన్ విడుదలైన 3 రోజుల్లో మారటోరియం ఎత్తివేత
- నోటిఫికేషన్ వచ్చిన 7 రోజుల్లో కొత్త బోర్డుకు బ్యాంకు బాధ్యతలు