ద్విచక్ర వాహన కంపెనీలన్నీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ బైక్, స్కూటర్లను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. కొన్ని కంపెనీలు తమ విద్యుత్ బైక్లను ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేశాయి. వీటికి డిమాండ్ కూడా బాగున్నట్లు షోరూంల డీలర్లు చెబుతున్నారు. భవిష్యత్లో ఇది ఇంకా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ రేట్లు భారీగా పెరగటం కూడా ఈ డిమాండ్ పెరిగేందుకు కారణంగా చెప్పొచ్చు.
మరి ఎలక్ట్రిక్ స్కూటర్, బైక్లను కొనుగోలు చేసే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏమిటి? అనే విషయంపై నిపుణుల సూచిస్తున్న టిప్స్ ఇప్పుడు పరిశీలిద్దాం.
రేంజ్
ఇంధనం లేదా బ్యాటరీతో ప్రయాణించే దూరమే రేంజ్. ఎలక్ట్రిక్ బైక్, స్కూటర్లలో ఎలాంటి ఇంధనం ఉండదు కాబట్టి రేంజ్ అనేది చాలా ముఖ్యం. ఇంధన వాహనం అయితే ఎక్కడైనా పెట్రోల్ నింపుకునే వీలుంటుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో ఈ సదుపాయం ప్రస్తుతానికి చాలా తక్కువ. నగరంలోపల ప్రయాణించే ఉద్దేశంతో అయితే 70 నుంచి 100 కిలోమీటర్ల రేంజ్ సరిపోతుందంటున్నారు నిపుణులు.
బ్యాటరీ నాణ్యత
ఎలక్ట్రిక్ బైక్, స్కూటర్ నాణ్యత అనేది బ్యాటరీ పైనే ఆధాపడి ఉంటుంది. ప్రస్తుతం చాలా కంపెనీలు లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తున్నాయి. ఇవి ఎక్కువ సేపు వాహనాన్ని నడిచేలా చూస్తాయి. వీటి జీవిత కాలం కూడా ఎక్కువ. మంచి నాణ్యత ఉన్న బ్యాటరీల వల్ల వాహనం పనితీరు కూడా మెరుగుపడుతుంది. లిథియం బ్యాటరీలు రెండు నుంచి ఆరు గంటల వ్యవధిలో ఛార్జ్ అవుతాయి. అయితే లిథియం-అయాన్ బ్యాటరీ ఉన్న ఈ-స్కూటర్లు, బైక్ల ధర మిగతా వాటితో పోల్చితే కాస్త ఎక్కువగా ఉంటుంది.
వాహన ఉపయోగం