తెలంగాణ

telangana

ETV Bharat / business

'డిమాండ్​ పెంచేలా పన్ను ప్రోత్సాహకాలు ఇస్తే మేలు'

ఆదాయపు పన్ను ప్రోత్సాహకాల ద్వారా పారిశ్రామిక రంగం డిమాండ్ పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలని భారత కార్పొరేట్ వర్గాలు ఆశిస్తున్నాయి. ఫిక్కీ, ధ్రువ అడ్వైజర్స్ అనే సంస్థలు చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. డిమాండ్ సృష్టించటం, మౌలిక సదుపాయాలపై వ్యయం పెంచటం, సామాజిక రంగంపై ఎక్కవగా ఖర్చు చేయడంపై రాబోయే బడ్జెట్ దృష్టి సారించాలని కార్పొరేట్ వర్గాలు కోరుకుంటున్నట్లు సర్వే పేర్కొంది.

Budget 2021-22: India Inc pushes for personal income tax concession to boost demand
'ఆదాయపు పన్ను ప్రోత్సహకాలతో డిమాండ్​ పెంచాలి'

By

Published : Jan 23, 2021, 9:46 PM IST

ప్రస్తుతం కొనసాగుతోన్న కొవిడ్ టీకా కార్యక్రమం వల్ల ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతుందని భారత పారిశ్రామిక రంగం ఆశిస్తోంది. వ్యవస్థలో డిమాండ్ పెంచేందుకు పన్నులకు, ముఖ్యంగా వ్యక్తిగత ఆదాయపు పన్నులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని వారు కోరుకుంటున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ధ్రువ అడ్వైజర్స్ చేసిన సర్వే లో వెల్లడైంది.

సర్వేలో వెల్లడైన ప్రధానాంశాలు

  • రాబోయే బడ్జెట్​లో ప్రభుత్వం డిమాండ్​ను సృష్టించటంతో పాటు మౌలిక సదుపాయలు, విద్య, వైద్యం, సేవా రంగాల వ్యయం పెంచడంపై దృష్టి సారించాలి.
  • భారతీయ పరిశ్రమలు బడ్జెట్ లో మూడు స్థూల ఆర్థిక అంశాలను చూడాలనుకుంటున్నట్లు సర్వే తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా సరఫరా గొలుసుల్లో ఆటంకం కలిగిన దృష్ట్యా.. పరిశోధన, నవకల్పన, కొత్త డిజిటల్ సర్వీసులు వృద్ధికి కీలకంగా ఉంటాయని వెల్లడించింది.
  • రాబోయే బడ్జెట్ లో తయారీ రంగాన్ని బలోపేతం చేయటంతో పాటు పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు విధాన పరమైన అంశాలపై దృష్టిని కొనసాగించాలని తెలిపింది.
  • ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్నప్పటికీ.. డిమాండ్ వృద్ధి కొన్ని రంగాలకే పరిమితమైందని సర్వే తెలిపింది. స్థిరంగా కొనసాగేందుకు వీలుగా డిమాండ్ పూర్వ స్థాయికి చేరుకోవాలంటే ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని వెల్లడించింది.
  • ప్రత్యక్ష పన్నులకు ఆదాయ పన్నులో ఊరట ఉంటుందని సర్వేలో పాల్గొన్న 40 మంది అభిప్రాయపడ్డారు. పన్ను స్లాబుల విషయంలో మార్పు ఉంటుందని దాదాపు సగం మంది అంచనా వేశారు.
  • ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే దిశగా.. మధ్యతరగతి ప్రజలకు పన్నుల్లో ఊరట కల్పించాలి. ఉద్యోగాల సృష్టి జరిగేందుకు కంపెనీలకు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలని సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. సగం కంపెనీలు నవకల్పనలు, ఎగుమతుల విషయంలో పన్ను ప్రయోజనాలు ఇవ్వాలని కోరాయి.

పన్నుల యంత్రాంగం లో సంస్కరణలు..

పరిశ్రమలతో పాటు వ్యాపారాలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కంపెనీల ప్రతినిధులు మాట్లాడారు. సగం మంది సమయానుగుణంగా పన్ను రిఫండ్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 49శాతం మంది పన్నులకు సంబంధించి ప్రక్రియ వల్ల సమస్యను ఎదుర్కొన్నట్లు చెప్పారు. పన్ను వివాదాలతో సమస్య ఎదుర్కొన్నట్లు 43 శాతం మంది వెల్లడించారు.

పన్ను వివాదాలను తగ్గించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండు పథకాలను ప్రకటించింది. జీఎస్టీ, కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీ లాంటి పరోక్ష పన్నుల విషయంలో 'సబ్ కా వికాస్'... ఆదాయ పన్ను, కార్పోరేషన్ పన్ను లాంటి ప్రత్యక్ష పన్నుల విషయంలో 'వివాద్ సే విశ్వాస్' పథకాలను తీసుకొచ్చారు.

ట్యాక్స్ టెర్రరిజంను అంతం చేసేందుకు స్థిరమైన, ఊహించదగిన పన్నుల పాలసీ ఉంటుందని 2014లో మోదీ తెలిపారు. పన్ను చెల్లింపుదారుల హక్కులను కాపాడేందుకు చార్టర్, ఫేస్​లెస్ అసెస్​మెంట్​లను గత సంవత్సరం ఆయన ప్రారంభించారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు క్షేత్ర స్థాయిలో యంత్రాంగంలో స్థిరత్వం ఉండాలని 85 శాతం మంది తెలిపారు.

జీఎస్టీకి ఆర్థిక కార్యకలాపాలే కీలకం..

2020 డిసెంబర్​లో జీఎస్టీ వసూళ్లు జీవన కాల గరిష్ఠన్ని తాకాయి. రూ. 1.15 లక్షల కోట్ల జీఎస్టీ ప్రభుత్వానికి వచ్చి చేరింది. అయితే ఈ స్థాయిలో వసూళ్లు కొనసాగటంపై కొంత మంది అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఇదే విధంగా కొనసాగించటం సవాళ్లతో కూడుకున్నదని అభిప్రాయపడ్డారు.

వినియోగాన్ని పెంచటం ద్వారా దేశంలో ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడం పై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సర్వేలో పాల్గొన్న తొంభై శాతం మంది అభిప్రాయపడ్డారు. దీనివల్ల జీఎస్టీ వసూళ్లు కూడా పెరుగుతాయన్నారు. జీఎస్టీ కలెక్షన్లు పెంచేందుకు నకిలీ ఇన్ వాయిస్​లపై కఠిన చర్యలు తీసుకోవటాన్ని 56 శాతం కంపెనీలు సమర్థించాయి.

ఉద్యోగ కల్పన కీలకం..

ఆర్థిక వ్యవస్థకు తిరిగి జవసత్వాలను అందించడాన్ని ప్రభుత్వం ప్రధానాంశంగా తీసుకొని చర్చలు చేపట్టాలని ఫిక్కీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ కోసం నిరంతరం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సర్వే ఫలితాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. డిమాండ్​ను పెంచటానికి తదుపరి ఉద్దీపన చర్యలను బడ్జెట్ ద్వారా ప్రభుత్వం తీసుకురావాలని పరిశ్రమలు కోరుకుంటున్నట్లు తెలిపారు. లోటు, ఆర్థిక పరిస్థితుల కంటే.. వృద్ధి సంబంధిత చర్యలకు బడ్జెట్ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

2020-21 బడ్జెట్ అంచనాల ప్రకారం ద్రవ్య లోటు 3.5 శాతంగా ఉండగా.. కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2020- మార్చి 2021) ద్రవ్యలోటు 6-7 శాతం మధ్య ఉంటుందని ఆర్థిక వేత్తల అంచనా వేస్తున్నారు.

ఉద్యోగాల సృష్టి, వినియోగదారుల జేబుల్లో డబ్బులు ఉండేలా చూడటం పై దృష్టి సారించాలని.. ఈ రెండు ఇంజన్ల ద్వారా ఆర్థిక వ్యవస్థ వృద్ధిలోకి వస్తుందని ఉదయ్ శంకర్ అన్నారు. దేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చేందుకు సులభతర పన్ను విధానంతో సహా సులభతర వాణిజ్య పరిస్థితులను మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమ వర్గాలు కోరుకుంటున్నట్లు ధ్రువ అడ్వైజర్స్ సీఈఓ దినేష్ కానబార్ తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదనలు సమీప భవిష్యత్ పై ప్రభావం చూపడమే కాకుండా, భారతదేశం యొక్క దీర్ఘకాలిక వృద్ధి గమనాన్ని కూడా ప్రభావితం చేయగలవని ఆయన అన్నారు.

- క్రిష్ణానంద్ త్రిపాఠీ

ఇదీ చూడండి: ఎంఎస్​ఎంఈల్లో ఉత్తేజం నింపడంలో ప్యాకేజీ విఫలం!

ABOUT THE AUTHOR

...view details