బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. లాక్డౌన్ సమయంలో తమ ఖాతాలను రీఛార్జ్ చేసుకోలేకపోయిన కస్టమర్లకు మే 5 వరకు ఉచితంగా ఇన్కమింగ్ కాల్స్ పొందే సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
"లాక్డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో..... ప్లాన్ గడువు ముగిసిన/ జీరో బ్యాలెన్స్ ఉన్న బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల మానవతా దృక్పథంతో.. అటువంటి చందాదారులకు 2020 మే 5 వరకు ఉచితంగా ఇన్కమ్ కాల్స్ స్వీకరించే వెసులుబాటు కల్పిస్తున్నాం."
- బీఎస్ఎన్ఎల్ ప్రకటన
రీఛార్జ్ హెల్ప్‌లైన్