తెలంగాణ

telangana

ETV Bharat / business

విక్రేతలకు రూ.1700 కోట్ల బకాయిలు చెల్లింపు - బిజినెస్​ తాజా వార్తలు

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్​ఎన్​ఎల్​ తమ విక్రయదారులకు రూ.1700 కోట్ల బకాయిలను చెల్లించింది. నవంబరులో ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలనూ చెల్లించినట్లు సంస్థ ఎండీ పీకే పుర్వార్​ తెలిపారు.

BSNL clears Rs 1,700 crore in dues to vendors; pays Nov salaries: CMD
విక్రేతలకు రూ.1700 కోట్ల  బకాయిల చెల్లింపు: బీఎస్​ఎన్​ఎల్​

By

Published : Dec 30, 2019, 7:18 PM IST

బీఎస్​ఎన్​ఎల్​ (భారతీయ సంచార నిగం లిమిటెడ్)​​ తమ విక్రయదారులకు రూ.1700 కోట్ల బకాయిలను చెల్లించినట్లు ఎండీపీకే పుర్వార్ తెలిపారు. ఉద్యోగులకూ నవంబరు నెలలో ఇవ్వాల్సిన జీతాలను సంస్థ చెల్లించిందన్నారు. నెలవారీ వేతన వ్యయం సుమారు రూ. 800 కోట్లుగా పేర్కొన్నారు.

పునరుద్ధరణ ప్యాకేజీ

ఈ ఏడాది అక్టోబర్​లో బీఎస్​ఎన్​ఎల్​, ఎమ్​టీఎన్​ఎల్​ల కోసం రూ.60,000 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం నష్టాల్లో మునిగిపోయిన ఈ రెండు సంస్థల విలీనం, ఆస్తులను మోనిటైజింగ్, ఉద్యోగులకు 'స్వచ్ఛంద పదవీ విరమణ' (వీఆర్ఎస్​) సౌకర్యం కలిగించడం ద్వారా రెండేళ్లలో ఈ సంయుక్త సంస్థను లాభదాయకం మార్చాలని నిర్ణయించింది.

అందుకే విలీనం

ముంబయి, దిల్లీలకు 'మహానగర్ టెలిఫోన్​ నిగమ్​ లిమిటెడ్'​ టెలికాం సేవలందిస్తోంది. మిగతా దేశమంతటికీ 'భారత్​ సంచార్ నిగమ్​ లిమిటెడ్​' సేవలందిస్తోంది. ఎమ్​టీఎన్​ఎల్​ గత పదేళ్లుగా, బీఎస్​ఎన్​ఎల్​ 2010 నుంచి నష్టాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని.. కలిపే ప్రణాళికకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రమంత్రివర్గం ఆమోదించింది.

వీఆర్​ఎస్​తో తగ్గనున్న రుణ భారం

ఈ మధ్యకాలంలో రెండు సంస్థలూ వీఆర్​ఎస్​ ప్రణాళికను ప్రారంభించాయి. ఈ కంపెనీలకు చెందిన చాలామంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణను ఎంచుకున్నారు. ఫలితంగా రుణ భారాన్ని మోస్తున్న టెలికాం కంపెనీలకు జీతాల్లో నుంచి ఏటా రూ.8,800 కోట్లు ఆదా అవుతుందని భావిస్తున్నారు. అలాగే ఈ రెండు సంస్థలు వచ్చే మూడేళ్లలో రూ.37,500 కోట్ల విలువైన ఆస్తులు మోనిటైజ్​ చేయనున్నాయి.

ఇదీ చూడండి:'పీఎంసీ కుంభకోణం కేసును క్షుణ్ణంగా పర్వవేక్షిస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details