అంతర్జాతీయంగా చమురు ధరలకు (Brent Crude Price) రెక్కలొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 80 డాలర్లు దాటిపోయింది. గత మూడేళ్లలో ముడి చమురు ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఈ ప్రభావంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై గట్టిగానే ఉండనుంది. ఇప్పటికే సెంచరీలు కొట్టిన ఇంధన ధరలు(Petrol Diesel price).. మరింత పెరిగిపోనున్నాయి.
ముడి చమురు ధరలు 80 డాలర్లతో ఆగిపోయేలా (crude oil prices opec) కనిపించడం లేదు. ఇదివరకటి అంచనాలను సంస్థలన్నీ సవరిస్తున్నాయి. బ్రెంట్ చమురు ధర బ్యారెల్‌కు 87 డాలర్లకు చేరుకోనుందని (Crude Oil forecast 2021) వాల్‌స్ట్రీట్ బ్యాంక్ అంచనా వేసింది. మరోవైపు, ఈ ఏడాది చివరి నాటికి ముడి చమురు ధర.. 90 డాలర్లకు చేరుకోనుందని గోల్డ్‌మన్ శాక్స్ (Goldman Sachs Crude oil) లెక్కగట్టింది. ముడిచమురు రంగంలో 'బుల్ ట్రెండ్' చాలా రోజులుగా ఉండనుందని, ప్రపంచ వ్యాప్తంగా సరఫరా-డిమాండ్ మధ్య అంతరం ఊహించినదానికంటే ఎక్కువగా ఉందని గోల్డ్‌మన్ శాక్స్ వ్యూహకర్తలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్యాసోలిన్, ఇతర పెట్రో అనుబంధ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని సీఎన్ఎన్ పేర్కొంది.
ఇకపై ఎలా ఉంటుందో...
దేశంలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు.. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు సాధారణంగా ఉన్నప్పుడే దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇక అంతర్జాతీయ ధరలకే రెక్కలు వస్తే దేశంలో వీటి రేట్లు ఏ స్థాయిలో ఉంటాయోనని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
ఒకప్పుడు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు వంద డాలర్లు దాటినా.. దేశంలో ధరలు పెద్దగా పెరగలేదు. 2013లో క్రూడ్ ఆయిల్ ధర (Crude oil prices in 2013) బ్యారెల్‌కు 106.46 డాలర్లుగా ఉండగా.. ఆ సమయంలో దిల్లీలో (Petrol prices in 2013) పెట్రోల్ రేటు లీటరుకు సగటున రూ.69.53 గా ఉంది. యూపీఏ రెండో పాలనలో అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లు జీవితకాల గరిష్ఠానికి చేరాయి. 2012 మార్చిలో బ్రెంట్ ధర రూ.123.61కి చేరింది. ఆ సమయంలోనూ దేశంలో పెట్రోల్ ధరలు సాధారణంగా ఉండటం గమనార్హం.
సుంకాలు విధించి బాదుడు...