భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్(Covaxin) టీకాను బ్రెజిల్ దిగుమతి చేసుకోనుంది. ఈ మేరకు బ్రెజిల్‌లోని ఔషధ నియంత్రణ సంస్థ అయిన 'అన్విసా' అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. 'కొవాగ్జిన్' టీకాకు గతంలో ఈ సంస్థ అనుమతి నిరాకరించింది. జీఎంపీ (గుడ్ మానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్) ప్రమాణాలు పాటించడం లేదని అప్పట్లో అభ్యంతరాలు వెలిబుచ్చింది. దీనిపై తగిన చర్యలు చేపట్టి మళ్లీ అనుమతి కోసం భారత్ బయోటెక్ దరఖాస్తు చేసినట్లు, దానికి 'అన్విసా' అనుమతి ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Covaxin: కొవాగ్జిన్‌కు బ్రెజిల్ అనుమతి - కొవాగ్జిన్ టీకా సరఫరా బ్రెజిల్లో
బ్రెజిల్లో కొవాగ్జిన్(Covaxin) టీకా సరఫరాకు ఆ దేశ ప్రభుత్వం అనుమతినిచ్చింది. తొలివిడతగా 40లక్షల డోసుల టీకా(vaccine) అందించే అవకాశముంది.
కొవాగ్జిన్‌కు బ్రెజిల్ అనుమతి
దీంతో బ్రెజిల్‌కు కొవాగ్జిన్(Covaxin) టీకా సరఫరా చేయటానికి అడ్డంకులు తొలగిపోయినట్లయింది. భారత్ బయోటెక్ బ్రెజిల్‌కు తొలివిడతగా 40 లక్షల డోసుల టీకా అందించే అవకాశమున్నట్లు సమాచారం. రష్యాకు చెందిన 'స్పుత్నిక్-వి' టీకా సైతం బ్రెజిల్ దిగుమతి చేసుకోనుంది.
ఇదీ చదవండి :Biological-E: రూ.500లకే రెండు డోసుల టీకా!
Last Updated : Jun 6, 2021, 8:49 AM IST