తెలంగాణ

telangana

ETV Bharat / business

వాట్సాప్​ ద్వారా వంట గ్యాస్​ బుకింగ్ సేవలు

ఇక నుంచి తమ వినియోగదారులు వాట్సాప్​లో వంట గ్యాస్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది రెండో అతిపెద్ద చమురు సంస్థ భారత్​ పెట్రోలియం కార్పొరేషన్​ లిమిటెడ్​. కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకే ఈ సేవలు ప్రారంభించినట్లు ప్రకటనలో తెలిపింది.

BPCL launches cooking gas booking via WhatsApp
వాట్సాప్​ ద్వారా వంట గ్యాస్​ బుకింగ్ సేవలు

By

Published : May 27, 2020, 1:11 PM IST

దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి వాట్సాప్​లో వంటగ్యాస్ బుకింగ్​ సేవలను ప్రారంభించినట్లు తెలిపింది భారత్​ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్​)​. రిజిస్టర్​ అయిన కస్టమర్లు 1800224344 నంబర్​కు మెసేజ్ చేసి ఈ సదుపాయాన్ని పొందవచ్చని ప్రకటనలో పేర్కొంది. వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకే ఈ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది.

భారత్​లో రెండో అతిపెద్ద చమురు సంస్థ అయిన బీపీసీఎల్​కు 7.1కోట్ల మంది వినియోగదారులున్నారు. వాట్సాప్​ను యువత, వృద్ధులు సహా దాదాపు ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారని, వంటగ్యాస్ బుకింగ్​ను మరింత సులభతరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ అరుణ్​ సింగ్ తెలిపారు.

వాట్సాప్​లో బుకింగ్ చేసుకున్న భారత్​ గ్యాస్​ వినియోగదారులకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. దానితో పాటు పేమెంట్ చేయాల్సిన లింక్​ ఉంటుంది.​ క్రెడిట్ కార్డు, డెబిట్​ కార్డు, యూపీఐల ద్వారా చెల్లింపు పూర్తి చేయవచ్చు. కొత్తగా ట్రాకింగ్ సదుపాయంతో పాటు, కస్టమర్ల నుంచి ఫీడ్​బ్యాక్​ తీసుకోనున్నట్లు సింగ్ చెప్పారు.

ఐవీఎస్​ఆర్​, మిస్డ్​ కాల్, యాప్, వెబ్​సైట్​ ద్వారా ఇప్పటికే బుకింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది బీపీసీఎల్. ఇప్పుడు కొత్తగా వాట్సాప్​ బుకింగ్​ను ప్రారంభించింది.

ABOUT THE AUTHOR

...view details