కొవిడ్‌తో చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కొన్నైతే కొలుకోని విధంగా సంక్షోభంలో చిక్కుకున్నాయి. అందులో స్థిరాస్తి రంగం కూడా ఒకటి. అయితే కరోనా వల్ల కొత్త వ్యాపారాలకూ అవకాశాలు వచ్చాయి. కొవిడ్ వల్ల డిజిటిల్ ఫ్లాట్‌ఫామ్‌ల వినియోగం పెరిగింది. దీనివల్ల భారత్‌లో డేటా సెంటర్ల వ్యాపారం ఊపందుకుంటోంది. అనరాక్ క్యాపిటల్ నివేదిక ప్రకారం.. లాక్‌డౌన్‌లో డేటా సెంటర్ల సామర్థ్యం 25-35 శాతం పెరిగినట్లు తెలిసింది.
డేటా సెంటర్ల డిమాండ్ పెరిగేందుకు కారణాలు..
ఆన్‌లైన్ తరగతులు, వర్క్ ఫ్రం హోం, స్మార్ట్‌ఫోన్ వినియోగం, ఆన్‌లైన్ లావాదేవీలు, ఈ-కామర్స్‌లో షాపింగ్.. ఇలా ప్రతి ఒక్కటి డేటాకు సంబంధించినదే. కరోనా వల్ల వీటి వినియోగం విపరీతంగా పెరిగింది. ఫలితంగా డేటా సెంటర్ల వ్యాపారాలు ఈ స్థాయిలో వృద్ధి చెందినట్లు అనరాక్ నివేదిక పేర్కొంది.
ఇంటర్నెట్ వినియోగదారుల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. దేశంలో యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారతీయుల వ్యక్తిగత గోప్యతను దృష్టిలో ఉంచుకుని డేటా ప్రొటెక్షన్ బిల్లు, ఈ కామర్స్ పాలసీ ముసాయిదాను తీసుకొచ్చింది ప్రభుత్వం. భారతీయుల డేటాను స్థానికంగా స్టోరేజ్ చేసుకోవాలనే విషయాన్ని ఇవి స్పష్టం చేస్తున్నాయి.
స్టార్టప్‌ల పరంగా భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. సర్వీసింగ్ వ్యాపారంలో దేశ వాటా దాదాపు 55 శాతంగా ఉంది. తదుపరి పారిశ్రామిక విప్లవంగా పరిగణిిస్తున్న ఇండస్ట్రీ 4.0 సాంకేతికతను భారీగా వినియోగించుకోనుంది భారత్. ఇవన్నీ డిజిటల్ భారత్‌కు దోహదపడుతున్నాయి.
హైదరాబాద్‌లో డిమాండ్..
దేశవ్యాప్తంగా డేటా సెంటర్లకు ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ప్రధానంగా డిమాండ్ ఉండనున్నట్లు అనరాక్ తెలిపింది.