అమెరికా ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ కీలకం నిర్ణయం తీసుకుంది. 737- మ్యాక్స్ జెట్ విమానాల ఉత్పత్తిని వచ్చే నెల నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. రెండు ప్రమాదాల తర్వాత భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచే విషయంలో ఆలస్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది బోయింగ్. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జీతాలు చెల్లిస్తూ విధుల్లో కొనసాగిస్తామని పేర్కొంది. ప్రస్తుతం స్టోరేజ్‌లో సిద్ధంగా ఉన్న 400 జెట్ విమానాలను పంపీణీ చేయడంపైనే దృష్టి సారించినట్లు బోయింగ్ తెలిపింది.
ఇండోనేసియా, ఇథియోపియాలో జరిగిన బోయింగ్ విమాన ప్రమాద ఘటనల్లో 346 మంది చనిపోయారు. ఈ ప్రమాదాల తర్వాత మార్చి నుంచి ఆ సంస్థకు కష్టాలు మొదలయ్యాయి. అమెరికాపై ఆర్థికంగా ఇది ప్రభావం చూపింది.