విలాసవంతమైన కార్లను తయరు చేసే జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ సంస్థ సరికొత్త ఆవిష్కరణలకు తెరతీస్తోంది. ఈ సంస్థ తాజాగా అందుబాటులోకి తెచ్చిన వింగ్ సూట్ సంచలనం రేపుతోంది. దీనిని వాడితే బ్యాట్‌మ్యాన్ తరహాలో గాల్లో విహరించే అవకాశం లభిస్తుంది. ఇది పూర్తిగా విద్యుత్తు ఆధారంగా పనిచేస్తుంది.
'బీఎండబ్ల్యూ' సూట్ వేసుకుంటే ఎగిరిపోవచ్చు! - wing suit latest news
జర్మనీకి చెందిన ప్రఖ్యాత బీఎండబ్ల్యూ సంస్థ సరికొత్త వింగ్‌సూట్‌ను అభివృద్ధి చేసింది. దీనిని సంస్థలో పనిచేసే ప్రొఫెషనల్ వింగ్‌సూట్ పైలట్ పీటర్ మూడేళ్లు కష్టపడి రూపొందించాడు. తాజాగా ఆయనే స్వయంగా గగన విహారం చేసి అబ్బురపరిచాడు.
వాస్తవానికి దీనిని పీటర్ సాల్జ్‌మన్ ప్రొఫెషనల్ వింగ్‌సూట్ పైలట్ మూడేళ్లు కష్టపడి అభివృద్ధి చేశాడు. ఇప్పుడు ఆయన స్వయంగా దీనిని ధరించి గగన విహారం చేశాడు. ఆయన 2017 నుంచి బీఎండబ్ల్యూతో కలిసి పనిచేస్తున్నాడు.
సాధారణ వింగ్‌సూట్‌లో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. కానీ, ఈ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ వింగ్‌సూట్‌తో మాత్రం 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలం. అంతేకాదు.. ఒక్కసారిగా నిట్టనిలువునా గాల్లోకి ఎగరగలిగే శక్తి కూడా వస్తుంది. ఇంపెల్లర్స్‌గా పిలిచే రెండు పరికరాలను ఈ సూట్‌కు అమర్చారు. ఒక్కోదానికి 25వేల ఆర్‌పీఎం ఉన్న 7.5 కిలో వాట్ల మోటార్‌ను అమర్చారు. ఇది 20 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. ఇది దాదాపు ఐదు నిమిషాలపాటు పనిచేయగలదు. సాల్జ్‌మన్ ఆస్ట్రియా పర్వతాలపై హెలికాప్టర్లో ప్రయాణిస్తూ 9,800 అడుగుల ఎత్తు మీద నుంచి దూకి విజయవంతంగా ఈ సూట్‌ను ఉపయోగించాడు.