టెస్లా కార్ల కొనుగోలుకు బిట్‌కాయిన్ చెల్లింపుల విషయంలో సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ యూ టర్న్ తీసుకున్నారు. కార్ల కొనుగోలుకు బిట్‌కాయిన్ పేమెంట్‌ను నిలిపివేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
గత కొన్నాళ్లుగా బిట్‌కాయిన్ విలువ రికార్డు స్థాయిలో పెరిగేందుకు ఎలాన్ మస్క్ కూడా ఓ కారణమయ్యారు. దీనితో ఈ ఏడాదే బిట్‌కాయిన్ ద్వారా తమ కార్లు కొనుగోలు చేసేందుకు వెసులుబాటు కల్పిస్తూ టెస్లా నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల్లోనే ఈ నిర్ణయంపై మస్క్ వెనక్కి తగ్గటం గమనార్హం.