తెలంగాణ

telangana

ETV Bharat / business

'జాన్సన్‌తో పాటు సొంత టీకా ఉత్పత్తి'

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌(జే అండ్‌ జే)కు చెందిన కరోనా టీకాను ఉత్పత్తి చేయబోతున్నట్లు హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఇ. మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహిమా దాట్ల వెల్లడించారు. దానితో పాటే సొంత టీకాను కూడా ఉత్పత్తి చేస్తామని తెలిపారు. ఇందుకు ప్లాంట్లు వేరువేరుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Mahima Datla
'జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా ఉత్పత్తీ చేపడతాం'

By

Published : May 19, 2021, 7:30 AM IST

సొంత టీకాతో పాటు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌(జే అండ్‌ జే)కు చెందిన కరోనా టీకాను సైతం ఉత్పత్తి చేయబోతున్నట్లు హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఇ. మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహిమా దాట్ల పేర్కొన్నారు. 'ఈ రెండు టీకాలకు మౌలిక వసతులు, ప్లాంట్లు పూర్తిగా విడి విడిగానే ఉంటాయి. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా రెండింటిని ఉత్పత్తి చేయబోతున్నామ'ని వార్తా సంస్థ 'రాయిటర్స్‌'కు ఆమె తెలిపారు.

ఉత్పత్తి ఎప్పుడు మొదలుపెట్టనున్నారన్న సంగతి కానీ, ఇతర వివరాలు కానీ వెల్లడించలేదు. ఏటా 60 కోట్ల జే అండ్‌ జే టీకా డోసులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తయారు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఫిబ్రవరిలో ఆమె తెలిపిన సంగతి విదితమే. కాగా, గత వారం భారత ప్రభుత్వం విడుదల చేసిన టీకాల జాబితా(ఈ ఏడాదిలో ఉత్పత్తి అయ్యే)లో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా లేకపోవడం గమనార్హం.

సొంత టీకా విషయానికొస్తే ఆగస్టు నుంచి 7.5-8 కోట్ల డోసులను తయారు చేయాలని బయోలాజికల్‌ ఇ భావిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదీ చూడండి:టీకా నిల్వలతో మెడికల్​ రిఫ్రిజిరేటర్లకు డిమాండ్

ABOUT THE AUTHOR

...view details