కొవాగ్జిన్ టీకాల ఉత్పత్తిని పెంచుతున్నట్టు భారత్ బయోటెక్ ప్రకటించింది. గుజరాత్ అంక్లేశ్వర్లోని తమ సబ్సిడరీ కంపెనీ అయిన 'చిరాన్ బెహ్రింగ్ వ్యాక్సిన్స్'లో అదనంగా 20కోట్ల టీకాలను ఉత్పత్తి చేయనున్నట్టు వెల్లడించింది. ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుందని స్పష్టం చేసింది.
అదనంగా 20కోట్ల కొవాగ్జిన్ టీకాల ఉత్పత్తి - కొవాగ్జిన్
తమ సబ్సిడరీ అయిన చిరాన్ బెహ్రింగ్ కంపెనీతో కలిసి అదనంగా 20కోట్ల కొవాగ్జిన్ టీకా డోసుల్ని ఉత్పత్తి చేయబోతున్నట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుందని పేర్కొంది.
ఇనాక్టివేటెడ్ వెరో సెల్ సాంకేతికత ఆధారంగా, ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్ జీఎంపీ కేంద్రాల్లో వార్షికంగా.. అదనంగా 20కోట్ల టీకాలను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు పేర్కొంది భారత్ బయోటెక్. 2021 క్యూ4 నుంచి ఈ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేసింది.
ప్రపంచంలో.. అత్యంత నాణ్యమైన రేబీస్ టీకాలను ఉత్పత్తి చేస్తున్న సంస్థల్లో చిరాన్ బెహ్రింగ్ ఒకటి. ఐరాస సంస్థలకు టీకాలను అందిస్తోంది. 20కిపైగా దేశాల్లో ఈ సంస్థ ఉత్పత్తులకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఈ సంస్థను సొంతం చేసుకోవడం వల్ల రెబీస్ టీకాల ఉత్పత్తిలో భారత్ బయోటెక్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.