తెలంగాణ

telangana

By

Published : Nov 1, 2020, 12:03 PM IST

ETV Bharat / business

'2021 రెండో త్రైమాసికంలో భారత్ బయోటెక్ టీకా'

నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభిస్తే 2021 రెండో త్రైమాసికంలో కరోనా టీకాను అందుబాటులోకి తీసుకొస్తామని భారత్ బయోటెక్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు మార్కెట్లోనూ వ్యాక్సిన్ విక్రయాలు జరపనున్నట్లు తెలిపారు. అయితే ధరపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.

Bharat Biotech to launch Covaxin in Q2 2021
2021 రెండో త్రైమాసికంలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్

కొవాగ్జిన్ టీకాను 2021లో విడుదల చేసేందుకు భారత్ బయోటెక్ సన్నాహాలు చేస్తోంది. నియంత్రణ సంస్థల నుంచి అన్ని అనుమతులు లభిస్తే రెండో త్రైమాసికం(జూన్-ఆగస్టు మధ్య)లో టీకాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ వెల్లడించారు. అయితే దేశవ్యాప్తంగా ఫేజ్ 3 ట్రయల్స్ నిర్వహించడంపైనే ప్రస్తుతం దృష్టిసారించినట్లు చెప్పారు.

"ట్రయల్స్ చివరి దశలో వచ్చే సమాచారం, వ్యాక్సిన్ సమర్థత, భద్రతను బట్టి అన్ని అనుమతులు లభిస్తే 2021 ద్వితీయ త్రైమాసికంలో టీకా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం."

-సాయి ప్రసాద్, భారత్ బయోటెక్ అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

దేశవ్యాప్తంగా 13-14 రాష్ట్రాల్లోని 25-30 ప్రాంతాల్లో ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ప్రసాద్ వెల్లడించారు. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్, తయారీ సదుపాయాల కల్పన సహా టీకా అభివృద్ధికి రూ.350-400 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు.

ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు వ్యక్తులకూ వ్యాక్సిన్​ను విక్రయించనున్నట్లు స్పష్టం చేశారు. ఇతర దేశాలకు సరఫరా చేసేందుకు చర్చలు సాగిస్తున్నట్లు చెప్పారు. అయితే టీకా ధరపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి-ఎన్డీఏది రెండు ఇంజిన్ల ప్రభుత్వం: మోదీ

ABOUT THE AUTHOR

...view details