తెలంగాణ

telangana

ETV Bharat / business

కొవాగ్జిన్ షెల్ఫ్ లైఫ్​ పెంచుతారా? - కొవాగ్జిన్​ షెల్ఫ్​లైప్​

దేశీయ టీకా కొవాగ్జిన్​ డోసు కాలపరిమితిని ఆరు నెల నుంచి రెండేళ్లకు పెంచాలని డీసీజీఐని భారత్​ బయోటెక్​ కోరినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు సంబంధించిన సమాచారాన్ని, కొవాగ్జిన్ టీకా రియల్‌ టైమ్ స్టెబిలిటీ డేటాను దరఖాస్తుకు జతచేసినట్లు సమాచారం.

Covaxin, shelf life of Covaxin
కొవాగ్జిన్ షెల్ఫ్ లైఫ్​పై డీసీజీఐకు భారత్ బయోటెక్‌ దరఖాస్తు!

By

Published : Apr 25, 2021, 5:28 PM IST

కొవాగ్జిన్ టీకా డోసు కాలపరిమితిని ఆరు నెలల నుంచి 24 నెలలకు పెంచాలంటూ భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)ని భారత్ బయోటెక్ సంస్థ కోరినట్లు సమాచారం. కొవాగ్జిన్ టీకా డోసులను రెండు నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచుతూ ఆరు నెలలపాటు పంపిణీ, అమ్మకాలు చేసేందుకు భారత్‌ బయోటెక్‌కు డీసీజీఐ గతంలో అనుమతి ఇచ్చింది.

అయితే ఈ కాలాన్ని ఆరు నెలల నుంచి 24 నెలలకు పెంచాలని కోరుతూ భారత్ బయోటెక్‌ డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు సంబంధించిన సమాచారాన్ని, కొవాగ్జిన్ టీకా రియల్‌ టైమ్ స్టెబిలిటీ డేటాను దరఖాస్తుకు జతచేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:నోటితో రెమ్‌డెసివిర్‌- ప్రాథమిక పరీక్షల్లో సత్ఫలితాలు

ABOUT THE AUTHOR

...view details