బ్రెజిల్.. కొవాగ్జిన్ టీకా కొనుగోళ్లను నిలిపేయాలని భావిస్తోందంటూ వస్తున్న వార్తలపై భారత్ బయోటెక్ స్పందించింది. ఇప్పటి వరకు బ్రెజిల్ తమకు ఎలాంటి ముందస్తు చెల్లింపులు చేయలేదని.. అందుకే కొవాగ్జిన్ డోసులను పంపిణీ చేయలేదని పేర్కొంది.
"సాధారణంగా వ్యాక్సిన్ల కోసం ఆయా దేశాల వైద్య ఆరోగ్య శాఖ.. టీకా ఉత్పత్తి చేస్తున్న సంస్థలతో ముందుగా ఒప్పందం చేసుకుంటుంది. ఆ తర్వాత ఆయా దేశాల్లో అత్యవసర వినియోగం అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాక. వ్యాక్సిన్ పంపిణీ చేస్తాం. ఇందుకోసం ఆయా దేశాలు ముందస్తుగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే యూఎస్ , ఈయూ.. లాంటి అనేక దేశాలు ముందస్తు ఒప్పందం చేసుకుని ఆర్డర్లు ఇచ్చాయి. మరికొన్ని దేశాల్లో అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం."
-- భారత్ బయోటెక్