కొవాగ్జిన్ టీకాను దేశంలోని వివిధ రాష్ట్రాలకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ నేరుగా సరఫరా చేస్తోంది. ఈ నెల 1వ తేదీ నుంచి 14 రాష్ట్రాలకు టీకా అందించటం మొదలు పెట్టినట్లు భారత్ బయోటెక్ సంయుక్త ఎండీ సుచిత్ర ఎల్ల తెలిపారు. 'కేంద్ర ప్రభుత్వం చేసిన కేటాయింపుల ప్రకారం రాష్ట్రాలకు నేరుగా టీకా అందించటం మొదలు పెట్టాం' అని ఆమె వివరించారు.
ఇతర రాష్ట్రాలు కూడా టీకా కోసం తమను సంప్రదిస్తున్నట్లు, టీకా లభ్యత ప్రకారం ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేస్తామని సుచిత్ర ఎల్ల తెలిపారు. టీకా అందుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కో డోసు 'కొవాగ్జిన్' టీకాను రాష్ట్రాలకు రూ.400 ధరకు ఇచ్చేందుకు భారత్ బయోటెక్ ముందుకు వచ్చింది.