తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్​లోకి కైరోన్ బెహ్రింగ్​ ర్యాబిస్​ టీకా - మార్కెట్​లోకి కైరోన్ బెహ్రింగ్​ ర్యాబిస్​ టీకా

భారత్ బయోటెక్ కంపెనీ తన అనుబంధ సంస్థ అయిన కైరోన్ బెహ్రింగ్ ద్వారా ఓ నూతన ర్యాబిస్ టీకాను నేడు భారతీయ విపణిలోకి విడుదల చేసింది. దీనిని కైరోర్యాబ్ పేరుతో మార్కెట్​లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది.

మార్కెట్​లోకి కైరోన్ బెహ్రింగ్​ ర్యాబిస్​ టీకా

By

Published : Nov 13, 2019, 5:18 PM IST

Updated : Nov 13, 2019, 6:29 PM IST

మార్కెట్​లోకి కైరోన్ బెహ్రింగ్​ ర్యాబిస్​ టీకా

భారత్​ బయోటెక్​... తన అనుబంధ సంస్థ కైరోన్​ బెహ్రింగ్​ ద్వారా ర్యాబిస్​ టీకాను విపణిలోకి సరికొత్తగా విడుదల చేసింది. దీనిని 'కైరోర్యాబ్'​ పేరుతో మార్కెట్​లోకి తీసుకొచ్చినట్లు దిల్లీలో ప్రకటించింది.

'రబీపుర్' సాంకేతికతతో...

కైరోన్​ బెహ్రింగ్ ఇంతకు ముందు ర్యాబిస్​ టీకాను 'రబీపుర్​' పేరుతో విక్రయించింది. అయితే భారత్​ బయోటెక్​ ఈ ఏడాది మార్చిలో జీఎస్​కే నుంచి కైరోన్​ బెహ్రింగ్​ను కొనుగోలు చేసింది. మేలో గుజరాత్​లోని అంకలేశ్వర్​ యూనిట్​ నుంచి తన వాణిజ్య కార్యక్రమాలను ప్రారంభించింది.​

"ఈ కొత్త ర్యాబిస్ టీకాను 'రబీపుర్' సాంకేతికతనే ఉపయోగించి, అదే ప్రదేశంలో తయారుచేస్తున్నాం. కైరోర్యాబ్​ తయారీ, మార్కెటింగ్​ను వేగవంతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం."
- కృష్ణ ఎల్లా, భారత్ బయోటెక్ ఛైర్మన్​ అండ్ ఎమ్​డీ

టీకాల కొరత తీర్చేందుకు..

ర్యాబిస్ టీకాను వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ఆసుపత్రులకు టెండర్ల ద్వారా అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ స్పష్టం చేసింది. మిగిలిన వాటిని ప్రైవేట్​ మార్కెట్​కు, ఎగుమతులకు కేటాయిస్తామని తెలిపింది.

"ర్యాబిస్ టీకాల​ కొరతను పూడ్చడానికి నిబద్ధతతో కృషి చేస్తున్నాం. అందుకే ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా 15 మిలియన్​ డోస్​లు పెంచడానికి అదనపు పెట్టుబడులు పెడుతున్నాం."
- కృష్ణ ఎల్లా, భారత్ బయోటెక్ ఛైర్మన్​ అండ్ ఎమ్​డీ

ఇండిర్యాబ్ పేరుతో మరొకటి...

భారత్​ బయోటెక్​.. 'ఇండిర్యాబ్'​ పేరుతో ఏటా 12 మిలియన్ ర్యాబిస్ వ్యాక్సిన్​ డోస్​లను తయారుచేస్తోంది. ఫలితంగా రెండు సంస్థల మొత్తం ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 27 మిలియన్ డోస్​లకు పెరిగింది.

40 మిలియన్ డోస్​లు అవసరం...

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కుక్కల నుంచి వ్యాపించే 'ర్యాబిస్' అనేది నివారించగలిగే వ్యాధి. అయితే టీకా అందుబాటులో లేక ఏటా 59 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ప్రాణనష్టం ఎక్కువ.

భారత్​లో ఏటా 17.4 మిలియన్​ కుక్కకాటు కేసులు నమోదు అవుతున్నాయి. ఫలితంగా 20 వేల 800 ర్యాబిస్ మరణాలు సంభవిస్తున్నాయి. అంటే భారత్​లో ఏడాదికి 40 మిలియన్ డోస్​ల రాబిస్ వ్యాక్సిన్ అవసరం.

ఇదీ చూడండి: పెళ్లిళ్ల సీజన్​తో పసిడి ధర పైపైకి.. నేటి ధరలు ఇవే...

Last Updated : Nov 13, 2019, 6:29 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details