వాతావరణ మార్పులపై సరైన చర్యలు తీసుకోవట్లేదని.. ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఆన్లైన్ మార్కెట్ దిగ్గజం అమెజాన్.. తాజాగా కీలక ప్రకటన చేసింది. వాతావరణ మార్పులను అరికట్టేందుకు 10బిలియన్ డాలర్లను కేటాయింస్తున్నట్లు సంస్థ సీఈఓ జెఫ్ బెజోస్ తెలిపారు.
ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు బెజోస్. పర్యావరణాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తున్న శాస్త్రవేత్తలు, కార్యకర్తలు, ఎన్జీఓలకు ఈ నిధులను అందిస్తామని పేర్కొన్నారు. వాతావరణంలో మార్పులు రావడం చాలా ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు.
వాతారవణ మార్పులు అనేది భూగోళానికి అత్యంత పెద్ద సమస్య. వాతావరణంలో నెలకొన్న విపత్కర మార్పులను ఎదుర్కొనేందుకు పోరాడాలనుకుంటున్నా. అందుకు కావాల్సిన మార్గాలను అన్వేషించడానికి నిపుణులతో కలిసి పనిచేయాలని భావిస్తున్నా.