ఫోన్‌బుక్‌లో వందల్లో కాంటాక్ట్‌లు ఉంటాయి. వాటిల్లో కొన్ని నంబర్లు ఎవరివో కూడా మర్చిపోతుంటాం. అలాంటివి ఫోన్ బుక్‌లో ఉన్నంత వరకూ ఎలాంటి సమస్య ఉండదు. అదే వాట్సాప్‌లో మీరుంటే? మీరు మర్చిపోయినా? అన్‌నోన్ కాంటాక్ట్‌లు మర్చిపోవు. మీ గురించి తెలుసుకుంటూనే ఉంటాయి. అందుకే.. ఎప్పటి నుంచో టచ్‌లో లేని కాంటాక్ట్‌లు, గుర్తు తెలియని ఫోన్ నంబర్లు ఉంటే వెతికి వెంటనే తొలగించండి. ఎప్పుడైనా అవసరం పడితే ఎలా? అనుకుంటే.. కాంటాక్ట్‌లను బ్లాక్ చేసైనా ఉంచండి. కావాలంటే అన్‌బ్లాక్ చేయొచ్చు. దీంతో మీ స్టేటస్‌లు, డీపీలు మీకు తెలిసిన వారికే కనిపిస్తాయి.
అన్నీ తెలిసేలా వద్దు
ప్రొఫైల్ ఫొటోలు ఎప్పటికప్పుడు మార్చేస్తుంటాం. మీ ఒక్కరి ఫొటో రకరకాల మార్పులు చేసి పెట్టుకుంటే ఫర్వాలేదు. అలా కాకుండా కుటుంబ సభ్యుల ఫొటోలు, ఇతర అప్‌డేట్‌లను డీపీగా పెట్టడం సురక్షితం కాదు. మీరు పెట్టింది ఏదైనా కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారు ఎవరైనా చూడొచ్చు. మీ నుంచి ఎలాంటి అనుమతినీ కోరాల్సిన పని లేదు. అందుకే మీ ప్రైవసీని కాపాడుకునేలా ప్రొఫైల్ ఫొటో సెట్టింగ్స్‌ని మార్చుకోండి. ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రొఫైల్ ఫొటోని ఎవ్రీవన్ కాకుండా మై కాంటాక్ట్స్‌లోకి మార్చేయండి. అప్పుడు కేవలం మీ అడ్రస్‌బుక్‌లో ఉన్నవారు మాత్రమే డీపీని చూడగలుగుతారు. ఫొటోని ఎవ్వరూ చూడొద్దు అనుకుంటే నోబడీ గానూ పెట్టుకోవచ్చు.
బ్యాక్‌అప్ మాటేంటి?
ఉన్నాయి కదా క్లౌడ్ సర్వీసులు అని ఐక్లౌడ్, గూగుల్ డ్రైవ్‌లోకి వాట్సాప్ డేటాని ఆటో బ్యాక్‌అప్ చేస్తున్నారా? అయితే, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే.. వాట్సాప్‌లో డేటా ఎన్‌క్రిప్షన్ మోడ్‌లో ఉంటుంది. ఇతరులు ఎవ్వరూ చూసేందుకు వీలుండదు. అదే ఐక్లౌడ్, గూగుల్ డ్రైవ్‌లకు ఎన్‌క్రిప్షన్ సపోర్టు ఉండదు. అందుకే.. మీకు అవసరమైన, ముఖ్యమైన డేటాని మాత్రమే సురక్షిత స్టోరేజ్ స్థావరాల్లో భద్రం చేసుకోండి.
వెరిఫికేషన్‌ను మార్చారా?