తెలంగాణ

telangana

ETV Bharat / business

జియో గిగాఫైబర్​ 'ఫిషింగ్​ మెయిల్స్'​తో జరభద్రం!

రిలయన్స్ జియో ఆగష్టు 12న ఎఫ్​టీటీహెచ్ వాణిజ్య సేవలు ప్రారంభించనుంది. అయితే గిగా ఫైబర్ రిజిస్ట్రేషన్​ పేరిట కొంత మంది స్కామర్లు... జియో వినియోగదారులను మోసగించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఏమరుపాటుగా ఉంటే నష్టపోతారు జాగ్రత్త!

By

Published : Aug 3, 2019, 4:10 PM IST

జియో గిగాఫైబర్​ 'ఫిషింగ్​ మెయిల్స్'​తో జరభద్రం!

జియో గిగా ఫైబర్​...! రిలయన్స్​ నుంచి వస్తున్న మరో సంచలనం. ఒకే కనెక్షన్​తో హైస్పీడ్​ ఇంటర్నెట్​, ల్యాండ్​లైన్​, డీటీహెచ్ సేవలు అందించడం గిగా ఫైబర్​ ప్రత్యేకత. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న గిగా ఫైబర్​... ఆగస్టు 12 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

ముకేశ్​ అంబానీ రిలయన్స్ జియో గిగా ఫైబర్​ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని గతేడాది ప్రకటించారు. అప్పటి నుంచి లక్షలాది మంది దీనికోసం ఎదురుచూస్తున్నారు. ఇదే అవకాశంగా తీసుకుని కొంత మంది స్కామర్లు హానికరమైన ఈమెయిల్స్ (ఫిషింగ్ మెయిల్స్) ద్వారా జియో వినియోగదారులను మోసగించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

'ఫిషింగ్​' అంటే ఏమిటి?

స్కామర్లు ప్రజలను తమ ఉచ్చులోకి రప్పించడానికి ఎలా ప్రయత్నిస్తారో మొదట అర్థం చేసుకోవాలి. ఇందుకోసం ఫిషింగ్ అంటే ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం. ఫిషింగ్ అనేది టెక్​ పరిభాషా పదం. ఇది 'వంచన', 'చౌర్యం'ను సూచిస్తుంది.

ఫిషింగ్ చేసే హ్యాకర్​ లేదా స్కామర్​ ముందుగా మిమ్మల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తాడు. అందుకోసం ఒరిజినల్​ వెబ్​సైట్​ను పోలి ఉండే వెబ్​సైట్​ను రూపొందిస్తాడు. తరువాత మీ బ్యాంకు ఖాతా సమాచారం, పాస్​వర్డ్​లు, వ్యక్తిగత సమాచారం లేదా సున్నితమైన డేటాను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఒకసారి సమాచారమంతా సేకరించాడంటే...... ఇంకేముంది మీ బ్యాంకు ఖాతాలోని ధనం గల్లంతే.

స్కామర్లతో జాగ్రత్త

జియో గిగాఫైబర్​ విషయానికి వస్తే... స్కామర్లు మొదటగా తాము సంస్థ ప్రతినిధులమని నమ్మిస్తారు. గిగా ఫైబర్​ రిజిస్ట్రేషన్ల పేరిట ఫిషింగ్ మెయిల్స్ పంపిస్తారు. వీటిలో సబ్జెక్ట్​.... గిగాఫైబర్ యాక్టివేషన్​ రిక్వెస్ట్ స్వీకరించాం అని ఉంటుంది. మెయిల్​లో జియో డిజిటల్ లైఫ్ మాస్ట్​హెడ్ ఉంటుంది. అలాగే గిగాఫైబర్ ప్లాన్​లతోపాటు వినియోగదారులు తమ సభ్యత్వాన్ని ధ్రువీకరించే లింకులు కూడా ఉంటాయి. ఇలాంటి మెయిల్స్ వస్తే కచ్చితంగా వాటిని తెరవవద్దు.

ఏమరుపాటు వద్దు

స్కామర్లు జియో ఉపయోగించే ఫాంట్​లు, గ్రాఫిక్​లనే ఉపయోగించి.... ఫిషింగ్ మెయిల్స్ పంపిస్తారు. ఇది నిజంగా జియోనే పంపించిందనే భ్రమ కల్పించి... మిమ్మల్ని బురిడీ కొట్టించడానికి ప్రయత్నిస్తారు. కానీ నిశితంగా పరిశీలిస్తే అది నిజమైనదా? లేదా? అనేది మీరే గుర్తించగలరు. కనుక అనుమానాస్పదంగా కనిపిస్తే అలాంటి మెయిల్స్​ను స్పామ్​లో పడేయండి.

ఇదీ చూడండి: విపణి: దేశీయ స్టాక్​ మార్కెట్లకు ఏమైంది?

ABOUT THE AUTHOR

...view details