తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆన్​లైన్ వీడియో లవర్స్​కు ఈ డేటా ప్లాన్లు బెస్ట్! - ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో ప్రవేశంతో డేటా ప్లాన్లు చాలా తగ్గాయి. ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. ఎక్కువ మంది ఆన్​లైన్​ వీడియోలు చూస్తున్నారు. వీరిని ఆకర్షించేందుకు నెట్​ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్​ లాంటి 'వీడియో ఆన్​ డిమాండ్' కంటెంట్​ ప్రొవైడర్లు తక్కువ ధరకే వివిధ ప్లాన్లను తీసుకువస్తున్నాయి. అయితే వీటిని చూడడానికి డేటా అవసరం కదా! ఇందుకోసం అందుబాటు ధరల్లో కొన్ని ప్లాన్​లు ఉన్నాయి. అవేంటో చూద్దాం!

ఆన్​లైన్ వీడియో లవర్స్​కు ఈ డేటా ప్లాన్లు బెస్ట్!

By

Published : Jul 31, 2019, 3:56 PM IST

మీరు మూవీ లవరా? ఆన్​లైన్​ టీవీ షోలు అంటే ఇష్టమా? నెట్​ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్​, హాట్​స్టార్, జీ-5లో నచ్చిన కార్యక్రమాలను వీక్షిస్తుంటారా? అయితే తప్పకుండా మీకో మంచి ప్రిపెయిడ్​ ప్లాన్​ కావాల్సిందే. మరి మీకు అందుబాటులో ఉండేలా... వివిధ నెట్​వర్క్​ సంస్థలు అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి చూద్దామా?

రిలయన్స్ జియో డేటా ప్యాక్​లు

వినియోగదారుల సౌలభ్యం కోసం రిలయన్స్ జియో ఒక రోజుకు 2 జీబీ చొప్పున డేటా ప్యాక్ అందిస్తోంది. ఈ డేటా ఒక రోజుకు సరిగ్గా సరిపోతుందని జియో భావిస్తోంది. ఈ సౌలభ్యం వల్ల వినియోగదారులు రోజుకు 3 నుంచి 4 గంటలపాటు తమకు ఇష్టమైన వీడియోలు చూసుకోవచ్చు. అదే సమయంలో తమ దైనందిన కార్యక్రమాలైన మెసేజింగ్, వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాలను బ్రౌజ్ చేసుకోవచ్చు.

నాలుగు ప్లాన్లు..

రోజుకు 2 జీబీ కేటగిరీలో రిలయన్స్ జియో నాలుగు ప్లాన్​లు అందిస్తోంది.

రూ.198 ప్లాన్- 28 రోజులు వ్యాలిడిటీ

, రూ.398 ప్లాన్​-70 రోజుల వ్యాలిడిటీ,

రూ.448 ప్లాన్​- 84 రోజుల వ్యాలిడిటీ,

రూ.498 ప్లాన్- 91 రోజుల వ్యాలిడిటీ

వీటిలో రూ.498 ప్రీపెయిడ్​ ప్లాన్​ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది అతి తక్కువ ధరకే డేటాను అందిస్తోంది. ఒక వేళ చందాదారులు తమ రోజువారీ డేటా ప్యాక్​లో 2 జీబీ సరిపోదని భావిస్తే, వారు రోజుకు 3 జీబీ డేటా అందించే 28 రోజుల వ్యాలిడిటీతో రూ.299 ప్రీపెయిడ్​ ప్లాన్​ను ఎంచుకోవచ్చు. పై అన్ని ప్లాన్​లతో అపరిమిత ఉచిత కాలింగ్​తో పాటు 100 ఎస్​ఎంఎస్​లు, రిలయన్స్ జియో యాప్​లను ఫ్రీగా పొందవచ్చు.

వొడాఫోన్​-ఐడియా ఆకర్షణీయ డేటా పాక్​లు

వొడాఫోన్ కస్టమర్లకు:

రూ.229 ప్రీపెయిడ్​ ప్లాన్- 2 జీబీ డేటా- 28 రోజుల వ్యాలిడిటీ

రూ.349 ప్లాన్- ​ రోజుకు 3 జీబీ డేటా - 28 రోజుల వ్యాలిడిటీ

రూ.255 ప్లాన్​- రోజుకు 2.5 జీబీ డేటా- 28 రోజుల వ్యాలిడిటీ

రూ.511 ప్లాన్​- రోజుకు 2 జీబీ డేటా -84 రోజుల వ్యాలిడిటీ

ఈ ప్రీపెయిడ్​ ప్లాన్స్ అన్నింటిలోనూ అపరిమిత ఉచిత కాలింగ్, ఎస్​ఎంఎస్​ సౌకర్యం ఉంది.

ఐడియా కస్టమర్లకు:

రూ.229 ప్రీపెయిడ్​ ప్లాన్​- రోజుకు 2జీబీ డేటా- 28 రోజుల వ్యాలిడిటీ

రూ.255 ప్లాన్​- రోజుకు 2.5 జీబీ డేటా- 28 రోజుల వ్యాలిడిటీ

రూ.499 ప్లాన్​- రోజుకు 2 జీబీ డేటా- 82 రోజుల వ్యాలిడిటీ

ఈ ప్రీపెయిడ్​ ప్లాన్స్ అన్నింటిలోనూ అపరిమిత ఉచిత కాలింగ్, ఎస్​ఎంఎస్​ సౌకర్యం ఉంది. ఐడియా సినిమాలు, టీవీ యాప్స్ ఉచితంగా చూడొచ్చు.

భారతీ ఎయిర్​టెల్​ డేటా ప్లాన్లు

ఎయిర్​టెల్ అందిస్తున్న రూ.499 డేటా ప్యాక్ చాలా ఆకర్షణీయమైంది.​ రోజుకు 2జీబీ డేటా- 82 రోజుల వ్యాలిడిటీతో ఉన్న ఈ ప్లాన్​లో చందాదారులు ఉచితంగా ఎయిర్​టెల్ ప్రీమియం సబ్​క్రిప్షన్ పొందుతారు. నాలుగు వారాల ఉచిత షా అకాడమీ కోర్సు పూర్తి చేయవచ్చు. వింక్ మ్యూజిక్, నార్టన్ మొబైల్ సెక్యూరిటీ, మరిన్ని అదనపు ప్రయోజనాలు పొందవచ్చు.

రూ.349 ప్లాన్​- రోజుకు 3 జీబీ డేటా- 28 రోజుల వ్యాలిడిటీ

రూ.299 ప్లాన్​- రోజుకు 2.5 జీబీ డేటా - 28 రోజుల వ్యాలిడిటీ. ఈ ప్లాన్​లో అమెజాన్ ప్రైమ్​, వింక్​ మ్యూజిక్​ను ఉచితంగా పొందవచ్చు.

ఇదీ చూడండి: సిద్ధార్థ ఆకస్మిక మృతితో కేఫ్​ కాఫీ డే షేర్లు కుదేలు

ABOUT THE AUTHOR

...view details