తెలంగాణ

telangana

ETV Bharat / business

బడ్జెట్ బైక్​లు కావాలా?- రూ.లక్ష లోపు బెస్ట్ ఇవే!

దేశంలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి బడ్జెట్ ధరలో బైక్​లకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. దీనికి తగ్గట్లుగా పలు కంపెనీలు ఇప్పటికే ఈ విభాగంలో బైక్​లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. మరి బడ్జెట్ ధరల్లో ఎక్కువగా అమ్ముడవుతున్న బైక్​లు ఏవో, అందులో మీకు సూట్ అయ్యేవి ఏవో ఓసారి లుక్కేయండి..

best budget bikes
బడ్జెట్​ బైక్​లు

By

Published : Jul 12, 2021, 12:30 PM IST

దేశంలో అమ్ముడయ్యే ద్విచక్రవాహనాల్లో బడ్జెట్ బైక్​లదే ప్రథమ స్థానం. ధరతో పాటు అధిక మైలేజ్ ఉండటమే దీనికి కారణం. ఈ సెగ్మెంట్​లో అన్ని కంపెనీల మోడళ్లు మార్కెట్​లో అందుబాటులో ఉన్నప్పటికీ.. కొన్ని మాత్రమే పాపులర్ అయ్యాయి.

రూ.లక్ష లోపు బైక్​లను పరిగణనలోకి తీసుకున్నట్లయితే హీరో మోటార్స్​కు సంబంధించినవే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ సెగ్మెంట్​లో హీరో తర్వాతి స్థానం హోండా, బజాజ్​ బైక్​లదే. రూ.లక్ష లోపు ఎక్కువగా విక్రయం అవుతున్న బైక్​లు, వాటి ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

హీరో స్ల్పెండర్ ప్లస్

భారత్​లోనే కాకుండా ప్రపంచంలోనూ అత్యధికంగా విక్రయం అవుతున్న బైక్​గా దీనికి చరిత్ర ఉంది. ఇందులో స్ల్పెండర్ ప్లస్, స్ల్పెండర్ ఐస్మార్ట్, సూపర్ స్ల్పెండర్ మోడళ్లు ఉన్నాయి. ఏప్రిల్ 2020- జనవరి 21 మధ్య 19.32 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి.

హీరో స్ల్పెండర్ ప్లస్

ఫీచర్లు ఇవే..

ఇంజిన్: 97.2 సీసీ, సింగిల్ సిలిండర్

మైలేజ్: 63 కిలోమీటర్లు/లీటర్

ట్రాన్స్​మిషన్: 4 స్పీడ్

ట్యాంక్ సామర్థ్యం: 9.8 లీటర్లు

ధర: రూ.76,036

హీరో హెచ్ఎఫ్ డీలక్స్

దేశీయంగా ఎక్కువగా విక్రయమవుతున్న టాప్​ మోడళ్లలో ఇది ఒకటి. ఏప్రిల్ 2020- జనవరి 2021 మధ్య 13.90 లక్షల హెచ్ఎఫ్ డీలక్స్​లు అమ్ముడయ్యాయి.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్

ఫీచర్లు ఇవే...

ఇంజిన్: 97.2 సీసీ, సింగిల్ సిలిండర్

మైలేజ్: 65 కిలోమీటర్లు/లీటర్

ట్రాన్స్​మిషన్: 4 స్పీడ్

ట్యాంక్ సామర్థ్యం: 9.6 లీటర్లు

ధర: రూ. 67,319

హోండా షైన్

హోండా నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ ఇది. ఏప్రిల్ 2020- జనవరి 2021 మధ్య 7.54 లక్షల బైక్​లు విక్రయమయ్యాయి.

హోండా షైన్

ఫీచర్లు...

ఇంజిన్: 124 సీసీ

మైలేజ్ : 55 కిలోమీటర్లు/లీటర్

ట్రాన్స్​మిషన్: 5 స్పీడ్

ట్యాంక్ సామర్థ్యం: 10.5 లీటర్లు

ధర: రూ. 87,406

బజాజ్ పల్సర్

బజాజ్​కు సంబంధించి విక్రయాలపరంగా ఇది టాప్​ మోడల్. ఏప్రిల్ 2020- జనవరి 2021 మధ్య 7.7 లక్షల యూనిట్లు విక్రయమయ్యాయి. పల్సర్ 125, పల్సర్ 150, 150 నియాన్, 150 ట్విన్ ఇలా పలు మోడళ్లు ఉన్నాయి. 125సీసీకి సంబంధించిన ఫీచర్లు ఓసారి పరిశీలిస్తే..

బజాజ్ పల్సర్

ఇంజిన్: 124.4సీసీ

మైలేజ్: 50.5 కిలోమీటర్లు

ట్రాన్స్​మిషన్: 5 స్పీడ్

ట్యాంక్ సామర్థ్యం: 11.5 లీటర్లు

ధర: రూ.95,005

హీరో ప్యాషన్ ప్రో

దేశీయంగా దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇది చాలా కాలం నుంచి కొనసాగుతున్న మోడల్. ఏప్రిల్ 2020-జనవరి 2021 మధ్య 4.22 లక్షల యూనిట్లు విక్రయమయ్యాయి.

హీరో ప్యాషన్ ప్రో

ఫీచర్లు...

ఇంజిన్: 110సీసీ

మైలేజ్: 60 కిలోమీటర్లు

ట్రాన్స్​మిషన్: 4 స్పీడ్

ట్యాంక్ సామర్థ్యం: 10 లీటర్లు

ధర: రూ.82,552

బజాజ్ ప్లాటినా

బజాజ్ కంపెనీకి సంబంధించి కమ్యూటర్ సెగ్మెంట్​లో మంచి విక్రయాలను ఈ మోడల్ నమోదు చేస్తోంది. ఈ మోడల్​ బైక్​లు ఏప్రిల్ 2020- జనవరి 2021 మధ్య 3.36 లక్షలు విక్రయమయ్యాయి.

బజాజ్ ప్లాటినా

ఫీచర్లు..

ఇంజిన్: 102 సీసీ

మైలేజ్: 75 కిలోమీటర్లు

ట్రాన్స్​మిషన్: 4 స్పీడ్

ట్యాంక్ సామర్థ్యం: 11 లీటర్లు

ధర: రూ. 64,179

హీరో గ్లామర్

విక్రయాలపరంగా హీరో మోటార్ సైకిల్స్​కు ఇది ప్రధానమైన మోడల్. ఏప్రిల్ 2020- జనవరి 2021 మధ్య 4.03 లక్షల విక్రయాలను నమోదు చేసింది.

హీరో గ్లామర్

ఫీచర్లు ఇవే..

ఇంజిన్: 124.7సీసీ

మైలేజ్: 55 కిలోమీటర్లు

ట్రాన్స్​మిషన్: 5 స్పీడ్

ట్యాంక్ సామర్థ్యం: 10 లీటర్లు

ధర: రూ. 89,475

ఇదీ చూడండి:BMW electric Bike: ఒకసారి ఛార్జింగ్​తో 130 కిమీ ప్రయాణం

ABOUT THE AUTHOR

...view details