తెలంగాణ

telangana

ETV Bharat / business

అదిరే ఫీచర్లతో రూ.50 వేలలోపు  స్మార్ట్ టీవీలు! - ఫిలిప్స్ స్మార్ట్ టీవీ ధర

ప్రస్తుతం స్మార్ట్ టీవీ అనేది దాదాపు ప్రతి ఇంట్లో కనబడుతోంది. రోజు రోజుకూ ఇంట్లో ఉండే టీవీల సైజూ పెరిగిపోతుంది. ఒకప్పటితో పోల్చితే టీవీల ధరలు కూడా చాలా తగ్గాయి. దీంతో చాలామంది 55 ఇంచుల టీవీలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విభాగంలో ఉన్న మంచి టీవీల గురించి తెలుసుకుందాం.

స్మార్ట్ టీవీ
స్మార్ట్ టీవీ

By

Published : Aug 17, 2021, 4:50 PM IST

Updated : Aug 17, 2021, 7:49 PM IST

ఒకప్పుడు 55 అంగుళాల టీవీ అంటే చాలా పెద్దది, ఇంట్లోకి అంత పెద్దది అవసరం లేదు అని చాలా మంది అనుకునే వారు. ఇప్పుడు 50కిపైగా ఇంచ్ స్క్రీన్ సైజు ఉన్న టీవీలు మాత్రమే కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సోనీ, శాంసంగ్, ఎల్​జీ లాంటి కంపెనీలు ప్రీమియం టీవీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అయితే ఈ విభాగంలో బడ్జెట్ విభాగమే కీలకంగా ఉంది. ప్రీమియం సెగ్మెంట్లోని ఫీచర్లను ఇవి అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూ. 50వేల స్థాయిలో అందుబాటులో ఉన్న 55 అంగుళాల టీవీల గురించి తెలుసుకుందాం..

ఫిలిప్స్ స్మార్ట్ టీవీ..

ప్రముఖ బ్రాండ్ ఫిలిప్స్ తీసుకొచ్చిన ఈ 55-అంగుళాల టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్​ను కలిగి ఉంది. కలర్ రిప్రొడక్షన్, స్కిన్ టోన్‌ల విషయంలో మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఫిలిప్స్ బ్రాండ్​లో ఉండే పీ5 పిక్చర్ ఇంజిన్ ఇందులో ఉంది. ఓటీటీ, సెటప్ బాక్స్ ద్వారా వీక్షించటానికి ఇది సరిపోతుంది. గేమింగ్ విషయంలో మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. కనెక్టివిటీ కోసం 4 హెచ్​డీఎంఐ పోర్ట్‌లు, 2 యూఎస్​బీ పోర్ట్‌లు ఉన్నాయి. ఇది హెచ్​డీఆర్ 10, హెచ్​డీఆర్ 10 ప్లస్, డాల్బీ విజన్‌తో సహా అన్ని హెచ్​డీఆర్ ఫార్మట్​లను సపోర్ట్ చేస్తుంది.

ఫిలిప్స్ స్మార్ట్ టీవీ..
  • స్పెసిఫికేషన్స్..
  • స్క్రీన్ సైజు (అంగుళం) : 55
  • స్క్రీన్ : ఎల్ఈడీ
  • స్క్రీన్ రిజల్యూషన్ : 4కే
  • 4కే హెచ్​డీఆర్ : సపోర్ట్ చేస్తుంది.
  • హెచ్​డీఎంఐ పోర్ట్ లు : 4
  • ధర : రూ.56,990(అమెజాన్)

రెడ్ మీ స్మార్ట్ టీవీ ఎక్స్ 55

ఇది హెచ్​డీఆర్ 10, హెచ్​డీఆర్ 10 ప్లస్, డాల్బీ విజన్, హెచ్ఎల్​జీ తదితర అన్ని ప్రముఖ హెచ్​డీఆర్ ఫార్మట్​లను సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీలో 3 హెచ్​డీఎమ్ఐ పోర్ట్​లు ఉన్నాయి. 4కే డిస్‌ప్లే ఉన్న ఈ టీవీ హెచ్​డీఆర్ కంటెంట్ వీక్షణ కోసం, గేమింగ్ కోసం ఉపయోగించుకోవచ్చని ఇప్పటికే కొనుగోలు చేసిన వారు చెబుతున్నారు. ఆండ్రాయిడ్ ఆధారిత ఎమ్ఐ ప్యాచ్ వాల్ యూఐ ఉంది.

రెడ్ మీ స్మార్ట్ టీవీ ఎక్స్ 55
  • స్పెసిఫికేషన్స్
  • స్క్రీన్ సైజు: 55 ఇంచులు
  • స్క్రీన్: ఎల్ఈడీ
  • స్క్రీన్ రిజల్యూషన్: 4కే
  • 4కే: సపోర్ట్ చేస్తుంది.
  • హెచ్​డీఎమ్​ఐ పోర్ట్‌లు: 3
  • ధర: రూ. 49999(అమెజాన్)

అమెజాన్ బేసిక్స్ టీవీ ఏబీ55యూ20పీఎస్

ఓటీటీ కంటెంట్ వీక్షించేందుకు ఇది సరిపోతుంది. బిల్డ్ ఇన్ ఫైర్ టీవీ స్టిక్ ఉంది. ఫైర్ టీవీ స్టిక్​లో ఉన్న యూఐ ఈ టీవీలోనూ ఉంటుంది. ఇది హెచ్​డీఎంఐ ఏఆర్​సీని సపోర్ట్ చేయదు.

అమెజాన్ బేసిక్స్ టీవీ ఏబీ55యూ20పీఎస్
  • స్పెసిఫికేషన్స్
  • సైజు: 55 ఇంచులు
  • స్క్రీన్: ఎల్ఈడీ
  • స్క్రీన్ రిజల్యూషన్: 4కే
  • 4కే హెచ్​డీఆర్: సపోర్ట్ చేస్తుంది.
  • హెచ్​డీఎమ్ఐ పోర్ట్‌లు: 3
  • ధర: రూ. 39999(అమెజాన్)

ఇఫ్ఫాల్కన్ 55హెచ్71

ఇఫ్ఫాల్కన్ అనేది ప్రముఖ టీవీ అయిన టీసీఎల్​కు చెందిన బ్రాండ్. ఇది క్యూ ఎల్ఈడీ టీవీ. టీవీ హెచ్​డీఆర్ 10, 10+, డాల్బీ విజన్‌లను సపోర్ట్ చేస్తుంది. ఇందులో క్రోమ్ కాస్ట్, గూగుల్ అసిస్టెంట్ ఇన్ బిల్డ్​గా ఉంది. ఆండ్రాయిడ్ టీవీ యూఐ ఉంది. ఈ టీవీ మెటాలిక్ ఫ్రేమ్​ను కలిగి ఉంది.

ఇఫ్ఫాల్కన్ 55హెచ్71

స్పెసిఫికేషన్స్

  • సైజు: 55 ఇంచులు
  • టీవీ రకం: క్యూఎల్ఈడీ
  • రిజల్యూషన్: 4కే
  • 4కే హెచ్​డీఆర్: సపోర్ట్ చేస్తుంది.
  • హెచ్​డీఎమ్ఐ పోర్ట్‌లు: 3
  • ధర: రూ.49999(అమెజాన్)

హైసెన్స్ 55ఏ73ఎఫ్

102 వాట్స్ జేబీఎల్ 6 స్పీకర్ సిస్టమ్ దీని ప్రత్యేకత. ఈ 4కే టీవీ అన్ని రకాల హెచ్​డీఆర్ ఫార్మట్​లను సపోర్ట్ చేస్తుంది. 4 హెచ్​డీఎమ్ఐ పోర్టులు, 2 యూఎస్​బీ పోర్టులు ఉన్నాయి. ఆండ్రాయిడ్ టీవీ 9 ఓఎస్ ఇందులో ఉంది.

హైసెన్స్ 55ఏ73ఎఫ్
  • స్పెసిఫికేషన్స్
  • సైజు: 55 ఇంచులు
  • టీవీ: ఎల్ఈడీ
  • స్క్రీన్ రిజల్యూషన్: 4కే
  • 4కే హెచ్​డీఆర్: సపోర్ట్ చేస్తుంది
  • హెచ్​డీఎంఐ పోర్ట్‌లు: 3
  • ధర: రూ.45,990(టాటా క్లిక్)

టీసీఎల్ 55పీ715

ఈ ఎల్ఈడీ టీవీ 4కేను సపోర్ట్ చేస్తుంది. హెచ్​డీఆర్ 10ను సపోర్ట్ చేస్తుంది. వాయిస్ ద్వారా టీవీని కంట్రోల్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ టీవీ 9 ఓఎస్ కారణంగా ప్లే స్టోర్, ఇతర యాప్​లను వాడుకోవచ్చు. క్రోమ్ కాస్ట్ బిల్డ్ ఇన్​గా ఉంది.

టీసీఎల్ 55పీ715

స్పెసిఫికేషన్స్

  • సైజు: 55 ఇంచులు
  • రిజల్యూషన్: 4కే
  • 4కే హెచ్​డీఆర్: సపోర్ట్ చేస్తుంది.
  • హెచ్​డీఎంఐ పోర్ట్‌లు: 3
  • ధర: రూ.44989(అమెజాన్)

నోకియా స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ

ఆంకియో ఆధారిత 360 డిగ్రీ సౌండ్ దీని హైలెట్. హెచ్​డీఆర్ 10 సపోర్ట్ చేస్తుంది. 420 నిట్స్ గరిష్ఠ బ్రైట్​నెస్ ఉన్నట్లు కంపెనీ చెబుతోంది. క్రోమ్ కాస్ట్, గూగుల్ అసిస్టెంట్ ఇన్​ బిల్ట్​గా ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 3 హెచ్​డీఎంఐ పోర్టులు, 2 యూఎస్​బీ పోర్టులు ఉన్నాయి.

నోకియా స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ

స్పెసిఫికేషన్స్

  • సైజు: 55
  • టీవీ: ఎల్ఈడీ
  • స్క్రీన్ రిజల్యూషన్: 4కే
  • 4కే హెచ్​డీఆర్: సపోర్ట్ చేస్తుంది.
  • హెచ్​డీఎంఐ పోర్ట్‌లు: 3
  • ధర: రూ.42999 (ఫ్లిప్ కార్ట్)

ఇవీ చదవండి:

Last Updated : Aug 17, 2021, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details