తెలంగాణ

telangana

ETV Bharat / business

వెంటాడిన మాంద్యం భయం- సెన్సెక్స్ 205 పాయింట్లు పతనం - నష్టపోయిన దేశీయ స్టాక్​మార్కెట్లు

భారత వృద్ధి రేటు తగ్గనుందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ​అంచనాలకు తోడు, బడ్జెట్​కు ముందు మదుపరులు ఆచితూచి వ్యవహరించడం వల్ల దేశీయ స్టాక్​మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ 205 పాయింట్లు కోల్పోయి 41 వేల 323 వద్ద ముగియగా, నిఫ్టీ 54 పాయింట్లు నష్టపోయి 12 వేల 169 వద్ద స్థిరపడింది.

benchmark indices end with losses
నష్టాలతో ముగిసిన స్టాక్​మార్కెట్లు

By

Published : Jan 21, 2020, 3:41 PM IST

Updated : Feb 17, 2020, 9:09 PM IST

దేశీయ స్టాక్​మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. లోహ, వాహన, బ్యాంకింగ్, ఎఫ్​ఎంసీజీ రంగాలు నష్టపోయాయి. 2020 బడ్జెట్​కు ముందు మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తుండడం, భారత వృద్ధి తగ్గనుందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్​) అంచనాలే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 205 పాయింట్లు కోల్పోయి 41 వేల 323 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 54 పాయింట్లు నష్టపోయి 12 వేల 169 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లో

ఆల్ట్రాటెక్ సిమెంట్​, భారతీ ఎయిర్​టెల్​, జీ ఎంటర్​టైన్​మెంట్​, బీపీసీఎల్​, భారతీ ఇన్​ఫ్రాటెల్, కోల్​ ఇండియా, కోటక్ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ, ఓఎన్​జీసీ, ఇండస్​ఇండ్ బ్యాంకు రాణించాయి.

టాటా స్టీల్​, ఎమ్​ అండ్​ ఎమ్​, ఐఓసీ, ఏషియన్ పెయింట్స్, పవర్​గ్రిడ్ కార్ప్, మారుతి సుజుకి నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు

చైనాను కరోనా వైరస్ పట్టిపీడిస్తున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లు షాంఘై, హాంగ్​కాంగ్​, టోక్యో, సియోల్ నష్టాల పాలయ్యాయి. ఐరోపా మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ

రూపాయి విలువ 5 పైసలు క్షీణించి, ఒక డాలరుకు రూ.71.16గా ఉంది.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 1.21 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 64.41 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: జూన్ 1 నాటికి పూర్తి స్థాయిలో 'వన్ నేషన్- వన్ రేషన్ కార్డ్'

Last Updated : Feb 17, 2020, 9:09 PM IST

ABOUT THE AUTHOR

...view details