తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్రంప్​ మాటలతో మళ్లీ ఆశలు- మార్కెట్లకు లాభాలు

దేశీయ పరిస్థితుల్ని బేఖాతరు చేస్తూ అంతర్జాతీయ సానుకూలతలపై పెట్టుబడిదారులు దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో స్టాక్​మార్కెట్లు లాభాల బాటపట్టాయి. సెన్సెక్స్​ 61 పాయింట్లు లాభపడి 40 వేల 840 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 12 మార్కు ఎగువన కొనసాగుతోంది.

Benchmark equity indices edge up in early deals
ట్రంప్​ మాటలతో మళ్లీ ఆశలు- మార్కెట్లకు లాభాలు

By

Published : Dec 6, 2019, 10:18 AM IST

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశలతో స్టాక్​మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. దేశీయంగా కాస్త ప్రతికూల పరిస్థితులు ఉన్నా... మదుపర్లు వాటిని బేఖాతరు చేసి కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. భవిష్యత్​లో వడ్డీ రేట్లు మరింత తగ్గించే అవకాశముందని గురువారం ఆర్బీఐ సంకేతాలు ఇవ్వడమూ లాభాలకు దోహదం చేసింది.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 61 పాయింట్లు లాభపడి 40 వేల 840 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 16 పాయింట్లు వృద్ధి చెంది 12 వేల 035 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో..

భారతీ ఇన్​ఫ్రాటెల్, రెడ్డీ ల్యాబ్స్, సన్​ఫార్మా, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్​ రాణిస్తున్నాయి.

ఎస్​ బ్యాంకు, జీ ఎంటర్​టైన్​మెంట్​, ఓఎన్​జీసీ, ఎస్​బీఐ, ఇన్ఫోసిస్​, హెచ్​డీఎఫ్​సీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి

ప్రస్తుతం రూపాయి విలువ స్థిరంగా ట్రేడవుతూ ... డాలరుకు రూ.71.26గా ఉంది.

ఇదీ చూడండి:సంపన్నుల కోసం శాంసంగ్ లగ్జరీ స్క్రీన్.. ధర రూ.12 కోట్లు!

ABOUT THE AUTHOR

...view details