ఒకప్పుడు ఏదైనా నేర్చుకోవాలంటే చాలా దూరాలు ప్రయాణించి, భారీగా ఫీజులు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆన్లైన్ పుణ్యమా అని అన్ని ఒక్క క్లిక్‌తో అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో ఎథికల్ హ్యాకింగ్(ethical hacking)పై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే ఉడెమి ఓ క్రాష్ కోర్సును ప్రవేశపెట్టింది. దీని పేరు 'స్టార్ట్ ఎథికల్ హ్యాకింగ్ విత్ పారట్ సెక్యూరిటీ ఓఎస్'. ఇది పూర్తిగా ఉచితం!(ethical hacking free course) ప్రాక్టికల్ ఎథికల్ హ్యాకింగ్, పెనిట్రేషన్ టెస్టింగ్, రెడ్- టీమింగ్పై ఈ కోర్సులో శిక్షణ ఇవ్వనుంది ఉడెమి.