దేశంలో అతిపెద్ద రుణదాత భారతీయ స్టేట్ బ్యాంకు తదుపరి ఛైర్మన్గా దినేశ్ కుమార్ ఖారా పేరును ప్రతిపాదించింది బ్యాంక్స్ బోర్డు బ్యూరో (బీబీబీ). ప్రస్తుత ఛైర్మన్ రజనీశ్ కుమార్ మూడేళ్ల పదవీకాలం అక్టోబర్ 7తో ముగియనుంది. ఆయన అనంతరం సీనియర్ ఎండీ దినేశ్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
ఇందుకోసం ఎస్బీఐలోని నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లకు ముఖాముఖి నిర్వహించింది బీబీబీ. పనితీరు, ఇతర అనుభవాలను పరిగణనలోకి తీసుకుని దినేశ్ పేరును ఖరారు చేశాయి. మరో ఎండీ చల్లా శ్రీనివాసులు శెట్టిని రిజర్వ్ జాబితాలో పెట్టింది.
తుదినిర్ణయం అప్పుడే..