రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రవేటీకరణను నిరసిస్తూ తొమ్మిది బ్యాంకు యూనియన్లు మార్చి15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు బందుకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు 'యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్'(యూఎఫ్‌బీయూ) ప్రకటించింది.
మార్చి 4, 9, 10 తేదీల్లో అడిషనల్ చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన సమావేశంలో ఆశాజనక ఫలితం రాలేదని 'అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం' ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. దీంతో బందుకు వెళుతున్నామని, దాదాపు 10లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు బంద్‌లో పాల్గొంటారని వెల్లడించారు.