తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకులకు వరుస సెలవులు- వారంలో ఐదు రోజులు బంద్! - సెప్టెంబర్​లో బ్యాంక్​ హాలిడేస్​

ఈ వారం బ్యాంకులు వరుస సెలవుల్లో (Bank Holidays) ఉండనున్నాయి. బ్యాంకుల్లో ఏదైనా పని ఉంటే ముందుగానే సెలవుల గురించి తెలుసుకుని వాటిని పూర్తి చేసుకోవడం ఉత్తమం. మరి బ్యాంకులు ఏఏ రోజు సెలవులో (Bank holidays in September) ఉండన్నాయో తెలుసుకోండి ఇప్పుడే.

Bank holidays Holidays in a row
బ్యాంకులకు వరుస సెలవులు

By

Published : Sep 6, 2021, 1:32 PM IST

Updated : Sep 6, 2021, 7:15 PM IST

మీకు ఈ వారం బ్యాంకుల్లో ఏదైనా పని ఉంటే.. ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈ వారం బ్యాంకులు 5 రోజులు వరుస సెలవులో (Bank Holidays) ఉండనున్నాయి. వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పండుగల సందర్భంగా బ్యాంకులు పని చేయడం లేదు.

సెలవుల వివరాలు ఇలా...

  • సెప్టెంబర్ 8- శ్రీమంత శంకరదేవ తిథి సందర్భంగా అసోంలో బ్యాంకులు పని చేయవు
  • సెప్టెంబర్​ 9, 10- తీజ్​ కారణంగా సిక్కింలో బ్యాంకులు సెలవులో ఉండనున్నాయి
  • సెప్టెంబర్ 10- వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు
  • సెప్టెంబర్​ 11- రెండవ శనివారం బ్యాంకులు పని చేయవు. (పలు నగరాల్లో వినాయక చవితి కూడా)
  • సెప్టెంబర్ 12- ఆదివారం(బ్యాంకులకు సాధారణ సెలవు)

ఇక సెప్టెంబర్ మొత్తం మీద చూస్తే.. బ్యాంకులు 12 రోజులు సెలవులో (Bank holidays in September) ఉండనున్నాయి. ఈ వారం ఐదు రోజుల సెలవులతో కలిపి.. వివిధ కారణాలతో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి.

ఇదీ చదవండి:సెప్టెంబరులో బ్యాంకు హాలిడేస్ ఇవే..​​

Last Updated : Sep 6, 2021, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details