తెలంగాణ

telangana

ETV Bharat / business

Bank holidays in november: నవంబర్​లో 17 రోజులు బ్యాంకు సెలవులు! - బ్యాంక్​ పనివేళలు

వివిధ పండగలు, సాధారణ సెలవులు కలుపుకొని నవంబరులో (Bank Holidays in November 2021) మొత్తం 17 రోజులు బ్యాంకులు పనిచేయవని ఆర్​బీఐ వెల్లడించింది. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయని స్పష్టం చేసింది.

banks to remain
నవంబరులో 17 రోజులు బ్యాంకులకు సెలవు

By

Published : Oct 31, 2021, 7:21 AM IST

నవంబర్‌లో బ్యాంకులకు (Bank Holidays in November 2021) 17 రోజులు సెలవు రానున్నాయి. ఈ విషయంపై ఆర్​బీఐ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. కన్నడ రాజ్యోత్సవం, ఛఠ్​ పూజా వంటి స్థానిక పండగ రోజుల్లో (Bank Holidays in November 2021) ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.

  • నవంబరు 1- కన్నడ రాజ్యోత్సవం/కుట్​ (బెంగళూరు, ఇంఫాల్​)
  • నవంబరు 3- నరక చతుర్దశి (బెంగళూరు)
  • నవంబరు 4 - దీపావళి (అగర్తలా, అహ్మదాబాద్, ఐజ్వాల్, బెలాపుర్​, భోపాల్​, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, దేహ్రాదూన్, గ్యాంగ్​టక్, గువాహటి, హైదరాబాద్​, ఇంఫాల్, జైపుర్, జమ్మూ, కాన్పుర్, కొచ్చి, కోల్​కతా, లఖ్​నవూ, ముంబయి, నాగ్​పుర్, దిల్లీ, పనాజీ, పట్నా, రాయ్​పుర్​, రాంచీ, షిల్లాంగ్, షిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం)
  • నవంబరు 5- దీపావళి/ విక్రమ్​ సంవాత్​ న్యూ ఇయర్​/ గోవర్ధన పూజ (అహ్మదాబాద్​, బెలాపుర్​, బెంగళూరు, దేహ్రాదూన్, గ్యాంగ్​టక్​, జైపుర్, కాన్పుర్​​, లఖ్​నవూ, ముంబయి, నాగ్​పుర్​)
  • నవంబరు 6- భాయ్​ దూజ్​/లక్ష్మీ పూజ/ నింగోల్​ ఛకౌబా (గ్యాంగ్​టక్​, ఇంఫాల్, కాన్పుర్​​, లఖ్​నవూ, షిమ్లా)
  • నవంబరు 10- ఛఠ్​ ​పూజ (పట్నా, రాంచీ)
  • నవంబరు 11- ఛఠ్​ ​పూజ (పట్నా)
  • నవంబరు 12- వంగలా (షిల్లాంగ్)
  • నవంబరు 19- గురునానక్​ జయంతి/కార్తిక పూర్ణిమ (ఐజ్వాల్​, బెలాపుర్​, భోపాల్​, చండీగఢ్​, దేహ్రాదూన్​, హైదరాబాద్​, జైపుర్​, జమ్ము, కాన్పుర్​​, కోల్​కతా, లఖ్​నవూ, ముంబయి, నాగ్​పుర్​, దిల్లీ, రాయ్​పుర్, రాంచీ, షిమ్లా, శ్రీనగర్​)
  • నవంబరు 22- కనకదశ జయంతి (బెంగళూరు)
  • నవంబరు 23 - సేంగ్​ కుట్సేనెమ్​ (షిల్లాంగ్)

తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు సెలవులు

  • నవంబర్‌ 4 - దీపావళి (గురువారం)
  • నవంబర్‌ 19 - గురునానక్‌ జయంతి/కార్తిక పూర్ణిమ (శుక్రవారం)
  • నవంబరు 7, 14, 21 & 28- ఆదివారం
  • నవంబరు 13 & 27 - రెండో, నాల్గవ శనివారాలు

ఇదీ చూడండి :బంగారంపై పెట్టుబడికి సిద్ధమవుతున్నారా?- అయితే ఇవి తప్పనిసరి!

ABOUT THE AUTHOR

...view details