తెలంగాణ

telangana

ETV Bharat / business

జూన్​లో బ్యాంక్​లకు అదనపు సెలవులు ఇవే.. - జూన్ బ్యాంక్ హాలిడేస్ లిస్ట్​

వచ్చే నెలలో మీకు బ్యాంకులో ఏదైనా పని ఉందా? అయితే ఇప్పుడు బ్యాంక్​ పనుల గురించి ముందే ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే వచ్చే నెలలో పలు ప్రత్యేక కారణాల వల్ల బ్యాంకులు అదనపు సెలవులో ఉండనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Bank Holidays List
బ్యాంక్ హాలిడేస్​ లిస్ట్

By

Published : May 26, 2021, 5:14 PM IST

కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ వల్ల చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు పరిమిత సిబ్బందితో పని చేస్తున్నాయి. అది కూడా తక్కువ సమయమే.

ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులో పనులు ముందే ప్లాన్​ చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా సెలవుల గురించి. రాష్ట్రాన్ని బట్టి బ్యాంకుల సెలవుల్లోనూ మార్పులు ఉంటాయి. ఇలా జూన్​లో మొత్తం ఏడు రోజులు అదనపు సెలవులు ఉన్నాయి.

సెలవులు ఎప్పుడెప్పుడు?

జూన్ 15న గురు రాజా సంక్రాంతి (మిథున్ సంక్రాంతి) నేపథ్యంలో ఒడిశాలో బ్యాంకులకు సెలవు. యంగ్ మిజో అసోసియేషన్​ (వైఎంఏ)డే సందర్భంగా మిజోరంలోను బ్యాంకులు పని చేయవు.

జూన్ 25న హర్​ గోవింద్​ జయంతి సందర్భంగా జమ్ముకశ్మీర్, శ్రీనగర్​లో బ్యాంక్​లకు సెలవు.

రెమ్నా నే సందర్భంగా జూన్​ 30న మిజోరంలో బ్యాంకులు పని చేయవు.

వీటితో పాటు జూన్ నెలలో 6వ తేదీ(ఆదివారం), 12న (రెండో శనివారం), 13న (ఆదివారం), 20 (ఆదివారం) జూన్​ 26న (నాల్గో శనివారం) జూన్​ 27న (ఆదివారం) దేశవ్యాప్తంగా బ్యాంకులు సెలవులో ఉండనున్నాయి.

ఇదీ చదవండి:వ్యక్తిగత రుణం, పీపీఎఫ్​పై లోన్​.. ఏది బెటర్?

ABOUT THE AUTHOR

...view details