కరోనా వల్ల జూన్లో బ్యాంకులు పని సమయాన్ని కొంత తగ్గించినప్పటికీ.. జులై నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఆర్బీఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులు వచ్చే నెలలో మొత్తం తొమ్మిది రోజుల పాటు సెలవుల్లో ఉండనున్నాయి.
ప్రత్యేక సెలవులు.
- 2021 ఆగస్టు 19- మొహరం
- 2021 ఆగస్టు 31 - శ్రీ కృష్ణాష్టమి
సాధారణ సెలవులు
- 2021 ఆగస్టు 1 - ఆదివారం
- 2021 ఆగస్టు 8 - ఆదివారం
- 2021 ఆగస్టు 14 - రెండో శనివారం
- 2021 ఆగస్టు 15 - ఆదివారం
- 2021 ఆగస్టు 22 - ఆదివారం
- 2021 ఆగస్టు 28 - నాలుగో శనివారం
- 2021 ఆగస్టు 29 - ఆదివారం
నెలాఖరు నాలుగు రోజుల్లో కేవలం ఒక్క రోజే బ్యాంకులు పని చేయనున్నాయి.