తెలంగాణ

telangana

ETV Bharat / business

సొంతింటి కల సాకారానికి ఇదే మంచి తరుణం - మాన్​సూన్​ ధమాకా ఆఫర్​

గృహరుణాల వడ్డీ రేట్లు ఇప్పుడు 6.6 శాతం నుంచి మొదలువుతున్నాయి. తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇవ్వడంతోపాటు కొత్త రుణగ్రహీతలను ఆకట్టుకునేందుకు బ్యాంకులు కొత్తగా కొన్ని ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు.. పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి.

key interest rates on home lones
గృహరుణాల వడ్డీ రేట్లు

By

Published : Aug 8, 2021, 2:23 PM IST

సొంతింటి కలను తీర్చుకునే వారికి ఇది మంచి తరుణంగానే భావించవచ్చు. ఫిబ్రవరి 2019 నుంచీ ఆర్‌బీఐ వడ్డీ రేట్లను దాదాపు 250 బేసిస్‌ పాయింట్ల వరకూ తగ్గించింది. దీంతో అన్ని రుణాల రేట్లూ దిగివచ్చాయి. ముఖ్యంగా గృహ రుణాల వడ్డీ రేట్లు ఇప్పుడు దాదాపు 6.6 శాతం నుంచీ ప్రారంభం అవుతున్నాయి. గతంలో మార్జినల్‌ ఆధారిత వడ్డీ రేట్లు (ఎంసీఎల్‌ఆర్‌) ఉండగా... ఇప్పుడు అన్ని బ్యాంకులూ రెపో ఆధారిత వడ్డీ రేటుకు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) మారిపోయాయి. రుణగ్రహీతలూ ఈ వడ్డీ రేటుకు మారిపోవడం వల్ల వారికి తక్కువ వడ్డీ రేటుకే రుణాలు లభిస్తున్నాయి. తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇవ్వడంతోపాటు కొత్త రుణగ్రహీతలను ఆకట్టుకునేందుకు బ్యాంకులు కొత్తగా కొన్ని ఆఫర్లనూ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాన్‌సూన్‌ ధమాకా పేరుతో నిర్వహణ రుసుమును ఈ నెల 31 వరకూ పూర్తిగా రద్దు చేసింది. ప్రస్తుతం ఈ బ్యాంకు 6.70శాతం వడ్డీతో గృహరుణాన్ని ఇస్తోంది. ప్రస్తుతం పలు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు 7శాతంలోపు వడ్డీకే గృహరుణాలను ఇస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఇది 8.4శాతం పైనే ఉండేది.ఇప్పటికే తగ్గించిన వడ్డీ రేట్లతో గృహరుణదారులను ఆకట్టుకుంటున్న బ్యాంకులు దీన్ని మరింత తగ్గించే ఆలోచనలో ఉన్నాయి.

బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై గరిష్ఠంగా 6 శాతం లోపే వడ్డీ అందుతోంది. నిధుల లభ్యతకూ బ్యాంకులకు ఢోకా ఉండటం లేదు. ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ ఆధారిత వడ్డీ రేటుకు అదనంగా వసూలు చేస్తున్న 2.5-3శాతం వడ్డీని తగ్గించేందుకు చూస్తున్నాయి. ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే, కొత్తగా రుణం తీసుకునే వారికే ఈ అవకాశాన్నిస్తున్నాయి. మరోవైపు ఇతర బ్యాంకుల నుంచి తమ వద్దకు రుణ బదిలీ చేసుకోవాల్సిందిగానూ బ్యాంకులు ఫోన్లు, సందేశాల రూపంలో కోరుతున్నాయి.

ఇవీ చదవండి:ఈ పొదుపు ఖాతా తెరిస్తే రూ.25 లక్షల బీమా!

ABOUT THE AUTHOR

...view details