బ్యాంకుల మెగా విలీనానికి వ్యతిరేకంగా ఈ నెల 27 చేపట్టాలని నిర్ణయించిన బ్యాంకు యూనియన్ల సమ్మె వాయిదా పడింది. ఈ మేరకు రెండు ప్రధాన బ్యాంకు యూనియన్లు అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), అఖిల భారత బ్యాంక్ అధికారుల సంఘం (ఏఐబీఓఏ) ప్రకటించాయి.
కరోనా ఎఫెక్ట్: బ్యాంకుల సమ్మె వాయిదా - PM Narendra Modi
కరోనా విస్తరిస్తున్న కారణంగా ఈ నెల 27న చేపట్టాలనుకున్న బ్యాంకుల సమ్మె వాయిదా పడింది. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు యూనియన్లు ప్రకటన చేశాయి.
కరోనా ఎఫెక్ట్: బ్యాంకుల సమ్మె వాయిదా
తొలుత ఈ రెండు సంఘాలు బ్యాంకుల మెగా విలీనం సహా ఐడీబీఐను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేయాలని నిర్ణయించాయి. అయితే తాజాగా దేశంలో కరోనా వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో సమ్మెను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు బ్యాంకు సంఘాలు స్పష్టం చేశాయి.
ఇదీ చూడండి:బంగారం ధరకు రెక్కలు- మళ్లీ రూ.42 వేలకు చేరువ