బ్యాంకులు వారి ఖాతాదారులకు అందించే సహాయక సర్వీసుల్లో మరొకటి బ్యాంకు లాకర్ సర్వీసు. చాలా మంది వారికి సంబంధించిన ముఖ్యమైన బంగారు ఆభరణాలు, పత్రాలను సురక్షితంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో బ్యాంకు లాకర్లలో దాచుకుంటారు. ఇవి తెరలతో పాటు భారీ మెటల్ తలుపులను కలిగి ఉంటాయి. మన దేశంలో బ్యాంకు లాకర్‌ను ఎలా తెరవాలో, దానికి ఉన్న నియమ నిబంధనలేంటో తెలుసుకుందామా?
భారతదేశంలో బ్యాంకు లాకర్‌ని ఎలా ప్రారంభించాలి?
మీరు బ్యాంకులో లాకర్‌ను పొందడానికి వీఐపీ కస్టమర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కేవలం ఒక బ్యాంకు ఖాతాను కలిగి ఉండి, లాకర్ కోసం వార్షిక అద్దెను చెల్లించాల్సి ఉంటుంది. మీరు లాకర్లు కలిగిన పబ్లిక్ లేదా ప్రైవేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ, ఐసీఐసీఐ లేదా హెచ్‌డీఎఫ్‌సీ) బ్రాంచీలను సందర్శించి, లాకర్ తీసుకోడానికి పాటించవలసిన నియమ, నిబంధనల గురించి తెలుసుకోండి.
బ్యాంక్ లాకర్ నియమ, నిబంధనలు:
బ్యాంకు లాకర్ పొందడానికి అనుసరించాల్సిన నియమ నిబంధనలు, షరతులను పరిశీలిస్తే.. మీరు లాకర్ పొందాలనుకుంటున్న బ్యాంకులో పొదుపు ఖాతాను కలిగి ఉండాలి. లాకర్‌ని పొందడానికి బ్యాంకులో పొదుపు ఖాతాను తెరవడం ముఖ్యమైన అంశం. ఒక పొదుపు ఖాతాను తెరవడానికి కావలసిన పత్రాలు - ఆధార్ కార్డ్, పాన్ కార్డు / ఫారం 60, కేవైసీ పత్రాలు.
బ్యాంక్ లాకర్ ఒప్పందం:
ప్రతి బ్యాంకు లాకర్ ఒప్పందం కలిగి ఉంటుంది. మీరు సదరు బ్యాంక్లో లాకర్ పొందడానికి ఈ ఒప్పందాన్ని అంగీకరించి, సంతకం చేయవలసి ఉంటుంది. ఇది నష్టపరిహార నిబంధనను కలిగి ఉంటుంది. అలాగే దీనిని స్టాంప్ కాగితంపై (కనీస విలువ రూ. 100) రాస్తారు.
వార్షిక అద్దె అడ్వాన్స్, డిపాజిట్ డబ్బు:
బ్యాంకులు మిమ్మల్ని ముందుగానే లాకర్ అద్దె అడ్వాన్స్ చెల్లించవలసిందిగా అడుగుతాయి, అలాగే డిపాజిట్ రూపంలో ఒక నిర్దిష్ట మొత్తాన్ని తీసుకుంటాయి. ఈ నిబంధనలు అన్ని బ్యాంకులకు ఒకే విధంగా ఉంటాయి, కానీ లాకర్ అద్దె మాత్రం బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. ఇతర ప్రత్యేక నియమ నిబంధనలను ఖాతాదారులే ఫుల్ ఫిల్ చేయవలసి ఉంటుంది.
ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకు లాకర్ చార్జీలను పోల్చి చూడండి.
భారతదేశంలో బ్యాంకు లాకర్‌ను ప్రారంభించడానికి అద్దె లేదా డిపాజిట్ రూపంలో ఎంత మొత్తాన్ని చెల్లించాలో చూస్తే.. వివిధ నగరాలలోని ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులకు వేర్వేరు రేట్లు ఉంటాయి. మీరు ప్రత్యేకంగా లాకర్‌ను పొందాలనుకుంటున్న శాఖను సందర్శించడం ద్వారా ఆయా రేట్లను తెలుసుకోవచ్చు.
లాకర్‌కు అద్దె చెల్లించినప్పుడు, దానిని నియమించడం లేదా సొంతం చేసుకోవడం లేదా లీజుకు ఇవ్వడం చేయవచ్చా?
మీరు లాకర్ తీసుకున్నప్పుడు మీకు, మీ బ్యాంకుకు మధ్య సంబంధం బెయిలర్, బెయిలీ మాదిరిగా ఉంటుంది. బెయిలర్ అనే వారు సర్వీసులను అమలు చేయడానికి తనకు సంబంధించిన వస్తువులను వేరొకరికి (బెయిలీ) అందిస్తారు. అలా చేసినప్పటికీ వస్తువులపై బెయిలర్ యాజమాన్యాన్ని కలిగి ఉంటాడు. ఉదాహరణకు: మీరు డ్రై క్లీనింగ్ కోసం మీ బట్టలను ఇచ్చారనుకుందాం. అప్పుడు డ్రై క్లీనింగ్ దుకాణదారుడు బెయిలీగా ఉంటాడు, అలాగే మీరు బెయిలర్‌గా ఉంటారు. మీ వస్తువులు అతని ఆధీనంలో ఉంటాయి కానీ వాటికి యజమానులుగా మీరే ఉంటారు. అదేవిధంగా మీరు లాకర్ తీసుకున్నప్పుడు, లాకర్‌లో ఉన్న మీ వస్తువులు బ్యాంకు స్వాధీనంలో ఉంటాయి, కానీ వాటిపై యాజమాన్యాన్ని మీరు కలిగి ఉంటారు.
బ్యాంకు మీ వస్తువులకు బెయిలీ అయినప్పటికీ, మీ లాకర్లో ఉన్న వస్తువులపై ఎలాంటి అవగాహనను కలిగి ఉండదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్యాంకు మీకు అందించిన లాకర్ భద్రత, రక్షణ బాధ్యతను మాత్రమే చూసుకుంటుంది.
లాకర్‌కు చెందిన ఎన్ని తాళం చెవులను ఖాతాదారుడికి అందిస్తారు?
ఉమ్మడి పేరులో లాకర్‌ను తీసుకున్నప్పటికీ, లాకర్ యజమానికి ఒక తాళం చెవిని మాత్రమే అందిస్తారు. లాకర్ ఒప్పందంలో తాళం చెవి కీలకమైనది. దానిని జాగ్రత్తగా భద్రపరుచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అది పోయినా లేదా దొంగతనానికి గురైనా ఖాతాదారుడు వెంటనే బ్యాంకుకు తెలియజేయవలసి ఉంటుంది.
మీ బ్యాంకు లాకర్ తాళం చెవి పొతే ఏమవుతుంది?
తాళం చెవి పోయినట్లయితే బ్యాంకు అధికారులు లాకర్‌ను బద్దలు కొట్టి తెరుస్తారు. దానికి అయ్యే ఖర్చులను ఖాతాదారుడి నుంచే వసూలు చేస్తారు. అనంతరం ఆ లాకర్‌కు ఒక కొత్త లాక్‌ని అమర్చి దాని తాళం చెవులను ఖాతాదారుడికి అందజేస్తారు.
ఖాతాదారుడు లేకుండా లాకర్ తెరవడానికి అతని స్నేహితుడు / కుటుంబ సభ్యుడికి తాళం చెవిని ఇచ్చి పంపితే?