మీకు బ్యాంకులో ఏదైన పని ఉందా? అయితే ఈ సమాచారం తెలుసుకోవాల్సిందే. ఈ వారం మొత్తం మీద 4 రోజులు బ్యాంకులకు సెలవులో (Bank Holidays in September) ఉండనున్నాయి. కాబట్టి సెలవుల గురించి ముందే తెలుసుకుంటే..బ్యాంకు పనులు ఎప్పుడు చేసుకోవాలో ప్లాన్ చేసుకునే వీలుంటుంది. మరీ ఈ వారం సెలవులు ఎప్పుడెప్పుడు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాంక్ సెలవుల తేదీలు (Bank Holiday dates)
- సెప్టెంబర్ 20- సోమవారం, ఇంద్రజాత్ర(సిక్కింలో మాత్రమే)
- సెప్టెంబర్ 21- మంగళవారం, శ్రీ నారాయణ గురు సమాధి డే(కేరళలో మాత్రమే)
- సెప్టెంబర్ 25- నాలుగో శనివారం
- సెప్టెంబర్ 26- ఆదివారం