తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకులో డిపాజిట్​ చేయాలా? ఛార్జీలు చెల్లించాల్సిందే! - ఐబీబీపీలో విత్​డ్రా​కు ఛార్జీలు

Bank Deposit charges: బ్యాంకులో ఇకపై డిపాజిట్​ చేయాలన్నా రుసుము చెల్లించక తప్పదు. ఈ మేరకు ఇండియా పోస్ట్​ పేమెంట్స్​ బ్యాంకు(ఐపీపీబీ) తమ నిబంధనలు సవరించింది. నిర్దేశిత పరిమితి దాటి డిపాజిట్​ చేస్తే ఛార్జీలు వసూలు చేయనుంది.

Bank Deposit
Bank Deposit

By

Published : Dec 19, 2021, 3:54 PM IST

Bank Deposit charges: ఇండియా పోస్ట్​ పేమెంట్స్​ బ్యాంకు(ఐపీపీబీ).. తమ ఖాతాదారులకు ఝలక్​ ఇచ్చింది. వచ్చే ఏడాది నుంచి నగదు డిపాజిట్​ చేసినా.. విత్​ డ్రా చేసినా రుసుము చెల్లించాలి. ఈ మేరకు నిబంధనలను సవరించింది ఐపీపీబీ. ఈ బ్యాంకు.. ఖాతాదారులకు ఇచ్చిన పరిమితి వరకు నగదు లావాదేవీలు చేసుకోవచ్చు. ఆ పరిమితి దాటితో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్​ 2022 జనవరి 1న అమల్లోకి రానున్నాయి.

ఐపీపీబీ.. పలు ప్రయోజనాలతో మూడు రకాల పొదుపు ఖాతాలను (సేవింగ్​ అకౌంట్స్​) వినియోగదారులకు అందిస్తోంది. వేర్వేరు ఖాతాలు ఉన్నవారికి పరిమితులు కూడా వేర్వేరుగానే ఉంటాయి. ఆ వివరాలు ఇలా..

IPPB Basic Savings Account

ఐపీపీబీలో బేసిక్​ సేవింగ్స్​ అకౌంట్​ ఉన్నవారు ఎంత మొత్తమైనా.. ఎన్ని దఫాలైనా.. ఉచితంగా డిపాజిట్​ చేయవచ్చు. అయితే నెలకు నాలుగు సార్లు మాత్రమే నగదు ఉచితంగా విత్​డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత చేసిన ప్రతి లావాదేవీకి రుసుము చెల్లించాలి. డ్రా చేయాలనుకున్న మొత్తంలో 0.50 శాతం లేదా కనీసం రూ.25 బ్యాంకు వసూలు చేస్తుంది.

IPPB Savings and Current accounts

ఇతర సేవింగ్స్​(బేసిక్​ సేవింగ్స్ అకౌంట్స్​ కాకుండా), కరెంట్ అకౌంటుల్లో నెలకు రూ.10,000 వరకు నగదు ఉచితం డిపాజిట్​ చేయవచ్చు. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి 0.50 శాతం లేదా కనీసం రూ.25 ఛార్జీ చెల్లించాలి.

ఈ ఖాతాల నుంచి నెలకు రూ.25,000 వరకు నగదు ఉచితంగా విత్​డ్రా చేసుకోవచ్చు. ఆ పరిమితి దాటి విత్​డ్రా చేయాలనుకునే ప్రతి లావాదేవీకి 0.50 శాతం లేదా కనీసం రూ.25 ఛార్జీ చెల్లించాలి. ఈ ఛార్జీలపై జీఎస్​టీ లేదా సెస్​ ఉంటుందని ఐపీపీబీ తెలిపింది.

అంతకుముందు.. ఐపీపీబీ 2021 ఆగస్టు 1న డోర్​స్టెప్​ బ్యాంకింగ్​ ఛార్జీలను సవరించింది. వినియోగదారుల నుంచి ప్రతి రిక్వెస్ట్​కు రూ.20 చొప్పున రుసుము వసూలు చేస్తోంది.

ఇదీ చూడండి:'2022లో స్థిరాస్తి, బ్యాంకులు రాణిస్తాయ్‌'

ABOUT THE AUTHOR

...view details